News

వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో మైలు రాయి

480views

ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేష‌న్ ప్రక్రియ భారతదేశంలో కొన‌సాగుతోంది. ఈఏడాది జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన టీకా పంపిణీ మ‌రో మైలురాయిని అధిగ‌మించింది. దేశంలో ఇప్పటివ‌ర‌కు 18 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర కుటుంబ సంక్షేమ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన నివేదిక తెలిపింది. దేశ‌వ్యాప్తంగా 18,04,57,579మంది టీకా వేసుకోగా.. 96,27,199 మంది ఆరోగ్య కార్యక‌ర్తలు మొద‌టి డోసు తీసుకున్నారు. మ‌రో 66,21,675 మంది రెండో డోసు వేయించుకున్నార‌ని తెలిపింది.

ఫ్రంట్‌లైన్ వ‌ర్కర్లు 1,43,63,754 మంది మొద‌టి డోసు, 81,48,757 మంది రెండో డోసు తీసుకున్నారు.
18 నుంచి 44 ఏండ్ల వ‌య‌స్సువారు.. 42,55,362 మొద‌టి డోసు తీసుకోగా, 5,67,99,389 మంది 45 నుంచి 60 ఏండ్లు పైబ‌డిన‌వారు మొద‌టి డోసు 87,50,224 రెండో డోసు తీసుకున్నార‌ని తెలిపింది. ఇక 5,43,15,317 మంది 60 ఏండ్లు పైబ‌డిన‌వారు మొద‌టి డోసు, 1,75,47,584 మంది రెండో డోసు వేయించుకున్నార‌ని వెల్లడించింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.