
భారతీయ కమ్యూనిస్టుల స్వర్గధామం చైనాలో.. అక్కడి ప్రభుత్వం ముస్లింలను అణచి వేస్తోంది. మనదేశంలో తీవ్రవాదానికి మతంతో సంబంధం లేదని ఉపన్యసించే కుహనా మేథావులెవరూ దీనిపై స్పందించకపోవడం విశేషం. “వేలూ మనదే.. కన్నూ మనదే” అని కిక్కురుమనకుండా ఉండి ఉండొచ్చని.. కొందరు ఆరోపిస్తున్నారు.
తీవ్రవాద కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, సమాజంలో విద్వేషాలను, వేర్పాటు వాదాన్ని పురిగొల్పుతున్నారని ఆరోపిస్తూ చైనా ప్రభుత్వం ఇమామ్లను అదుపులోకి తీసుకుంది.
కేవలం ఇమామ్లుగా పని చేస్తున్నారన్న కారణంతోనే ఈ అరెస్టులు చేస్తున్నారని వారి బంధువులు చెబుతున్నారు. మొత్తం 1,046మంది ముస్లిం ఇమామ్లను ప్రభుత్వం గుర్తించిందని వీగర్ హక్కుల ప్రాజెక్టు వెల్లడించింది. ఈ 1,046 మందిలో దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో జైలులో గడిపారని హక్కుల సంస్థ వెల్లడించింది.
ఇక 630 కేసులలో 304మంది మత గురువులను జైలు లేదా రీ ఎడ్యుకేషన్ క్యాంపులకు పంపారు. కోర్టుల్లో వీరి మీద మోపిన అభియోగాలను బట్టి వీరిలో 96 శాతం మందికి కనీసం 5 ఏళ్ల జైలు, 26 శాతం మందికి 20 సంవత్సరాల పైన శిక్షలు పడ్డాయి. 14మందికి జీవిత కారాగార శిక్ష పడింది.
అయితే, ఈ సమాచారమంతా కేవలం జిన్జియాంగ్ ప్రాంతంలో ఉన్న మొత్తం ఇమామ్ల సంఖ్యలో ఇది కేవలం చిన్న భాగం మాత్రమేనని రీసెర్చ్ ప్రాజెక్టులో పాల్గొన్న అబ్దువెలీ ఆయుప్ వెల్లడించారు.
ఇమామ్లను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇక్కడి ముస్లింలను చైనా సంస్కృతిలో కలిపేయడానికి చైనా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంగా దీనిని ఆయన అభివర్ణించారు.
అయితే ఈ వాదనను అంగీకరించని చైనా ప్రభుత్వం, వీగర్లు, ఇతర ముస్లిం వర్గాలు వేర్పాటువాదం వైపు మొగ్గకుండా చూసేందుకే రీ ఎడ్యుకేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెబుతోంది.





