
కేరళలోని పూంజార్ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే P C జార్జ్ భారత్ ను హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేరళలోని తొడుపుజాలో ఒక ఉన్నత స్థాయి గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీ జార్జి ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో మతతత్వాన్ని, లవ్ జిహాద్ వంటి కార్యకలాపాల్ని అడ్డుకోవడానికి భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించడం ఒక్కటే పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.
కొన్ని రాజకీయ పార్టీలు ఇస్లామిక్ మత ఛాందస వాద సంస్థలతో జట్టు కట్టి భారత్ ను 2030 కల్లా ఇస్లామిక్ రాజ్యంగా మార్చడానికి కుట్రపన్నాయని, కానీ నోట్ల రద్దుతో అలాంటి వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట పడిందని ఆయన తెలిపారు.
రాజ్యాంగ కర్తలు భారతదేశం లౌకిక వాద, ప్రజాస్వామ్యయుత, సామ్యవాద దేశంగా ఉండాలని కలలు కన్నారని, కానీ దేశంలో సెక్యులరిజం అనేది దేశ సమగ్రతకు గొడ్డలిపెట్టుగా పరిణమించిందని ఆయన పేర్కొన్నారు.
Source : Organiser.





