
నీళ్ళు, మరుగుదొడ్డి లేని మట్టి ఇల్లు, మూడు మేకలు, మూడు ఆవులు, సేవింగ్స్ అకౌంట్ లో రూ 31,985 లు. ఇవి పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో బంకురా జిల్లా సాల్టోరా అసెంబ్లీ సీటుకు పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి చందనా బౌరి (30) ఆస్తుల వివరాలు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో ఇండ్లలో పాచి పని చేసుకునే కలిత అనే మహిళకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా రోజు కూలీ శ్రాబణ్ భార్య చందన బౌరీకి బిజెపి టికెట్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2021 లో పోటీ చేస్తున్న వారిలో ఆమె అత్యంత పేద అభ్యర్థి.

చందన బౌరి భర్త శ్రాబణ్ రోజువారీ కూలీ. ఆయన సంపాదన రోజుకు 400 రూపాయలు. వర్షాకాలంలో కూలీలు దొరకడం కష్టమైనప్పుడు చందన కూడా శ్రాబణ్ తో కలిసి పనికి వెళుతుంది. ఈ జంట మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGA) కార్డుదారులు కూడా. వారికి ముగ్గురు పిల్లలు.
“మల, మూత్ర విసర్జన కోసం మేము సమీపంలోని ఖాళీ ప్రదేశానికి వెళ్ళాలి. గత సంవత్సరం “ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన” తాలూకూ మొత్తం మొదటి విడతగా రూ 60,000 లు పొందాం. దాంతో ప్రస్తుతానికి రెండు కాంక్రీట్ గదులు నిర్మించుకున్నాం.” అని శ్రీమతి చందన చెప్పారు.
“తృణమూల్ అవినీతిమయమైనది, ఏ విధమైన అభివృద్ధి పనులూ చెయ్యలేదు. సంక్షేమ పథకాల కోసం మోడీజీ పంపిన మొత్తం డబ్బు అవినీతిపరుల జేబుల్లోకి వెళ్ళిపోయింది. టాయిలెట్ నిర్మించుకోవాలన్నా, ఇళ్ళు నిర్మించుకోవాలన్నా, ఏవైనా పథకాలను పొందాలన్నా ప్రజలు తృణమూల్ కార్యకర్తలకు లంచం ఇవ్వాలి.” అని చందన చెప్పారు.

సాల్ ఆకుల పలకలను తయారుచేసే చందన మామ సునీల్, “ఇంట్లో నాలుగు కుర్చీలు మాత్రమే మాకు చెందినవి. మిగిలినవి గ్రామస్తులు మరియు పార్టీ కార్యకర్తలు తీసుకువచ్చారు.” అని సగం పూర్తయిన తమ పక్కా ఇంటి ముందు ఉన్న కుర్చీలను చూపిస్తూ చెప్పారు.
సాల్టోరా సీటు నుండి ఎన్నికలలో పోటీ చేయడానికి పార్టీ తన టికెట్ ఇచ్చిందని మొదట ఆమెకు తెలియదు. ఆమె అభ్యర్థిత్వం గురించి బౌరీకి ఆమె పొరుగువారు చెప్పారు. మార్చి 27 న జరిగే మొదటి విడత ఎన్నికలలో సాల్టోరా నియోజకవర్గానికి ఎన్నికలు జరుగాతాయి.
Source : Organiser.





