
నిందితుడు గుజరాత్ లోని గోద్రా సమీపంలోని పంచమహల్ కి చెందిన ఇమ్రాన్ యాకుబ్ గితేలి అలియాస్ గితేలి ఇమ్రాన్ పై NIA ఐపిసి మరియు యుఎపిఎ యొక్క 17 మరియు 18 సెక్షనుల మేరకు కేసు నమోదు చేసింది. అతనిని విజయవాడలోని NIA ప్రత్యేక కోర్టులో హాజరు పరచింది. భారత్ లో గూఢచర్య కార్యకలాపాల కోసం నిధుల సేకరణలో పాల్గొన్నట్లుగా ఇమ్రాన్ పై ఆరోపణలున్నాయి.
ఈ కేసులో ప్రాధమికంగా ఐపిసి 120 బి మరియు 121 ఎ, యుఎ (పి) ఎ చట్టం, 1967 లోని సెక్షన్ 17 మరియు 18 అధికారిక రహస్యాలు చట్టం ప్రకారం అభియోగాలు మోపారు. భారత్‌లో ఉగ్రవాద చర్యలకు పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంట్లు, భారత్ కేంద్రంగా ఉన్న వారి సహచరులతో కలిసి కుట్ర చేసినట్లుగా ఇమ్రాన్ పై ఆరోపణలున్నాయి. వారు భరత్ యొక్క సమగ్రత, భద్రత మరియు సార్వభౌమత్వాన్ని సవాలు చేసేలా కీలకమైన రక్షణ సమాచారాన్ని, సున్నితమైన మరియు వర్గీకృత అధికారిక సమాచారాన్ని సేకరించి గూఢచర్య కార్యకలాపాలలో పాల్గొన్నారు. ఎన్‌ఐఏ 29.12. 2019 న కేసును తిరిగి నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో 15.06.2020న ముగ్గురు పాకిస్థాన్ పౌరులతో సహా 14 మంది నిందితులపై ఎన్‌ఐఏ ఇంతకుముందు చార్జిషీట్ దాఖలు చేసింది.
దర్యాప్తులో నిందితుడు యాకుబ్ ఇమ్రాన్ గితేలి పాకిస్తాన్ ఏజెంట్లతో సంప్రదింపులు జరిపాడని, పాకిస్తాన్ కి వెళ్లి వారిని కలుసుకున్నాడని, పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల సూచనల మేరకు, అతను సున్నితమైన మరియు వ్యూహాత్మక సమాచారాన్ని పంపించడానికి నేవీ సిబ్బంది ఖాతాల్లోకి డబ్బును బదిలీ చేస్తున్నాడు. అతను వస్త్ర వ్యాపారం ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులను సేకరిస్తున్నాడు. ఇమ్రాన్ యాకుబ్ గీతేలి వంటి కార్యకర్తల సేవలను ఉపయోగించుకుని భారత్‌లో పాకిస్తాన్ ఆధారిత గూఢచర్య కార్యకలాపాల వ్యవస్థీకృత విస్తృత నెట్ వర్క్ దర్యాప్తులో వెల్లడయింది.
Source : Organiser.





