News

కోవిడ్‌ టీకాపై మరింత అవగాహన కల్పించడం అవసరం – సీసీఎంబీ డైరెక్టర్

287views

నుకున్న స్థాయిలో వ్యాక్సినేషన్‌ సాగడం లేదని.. కొవిడ్‌ టీకాపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా అన్నారు. కార్డియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆరో వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకా అవసరమన్నారు. రెండో డోస్‌ తీసుకున్న 14 రోజులకు యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు. దాదాపు 20 నుంచి 30 శాతం మందిలో తొలిడోస్‌ నుంచే యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని వెల్లడించారు. అన్ని టీకాలు సురక్షితమని.. యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు. కరోనా కేసుల పెరుగుదలపై స్పందిస్తూ.. నిబంధనలు పాటించకపోవడం వల్లే పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో 55.5 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.