News

ఢిల్లీలోని ఇజ్రాయల్‌ ఎంబసీ వద్ద పేలుడు

529views

దేశరాజధాని ఢిల్లీలోని ఇజ్రాయల్‌ ఎంబసీ వద్ద శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు జరిగింది. ఎంబసీ భవనం పేవ్‌మెంట్‌ వద్ద ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మూడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. బాంబు పేలుడు దృష్ట్యా ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.