News

జీ-7 సదస్సుకు ప్రధాని మోడీకి ఆహ్వానం

France, August 25 (ANI): Prime Minister Narendra Modi meets UK Prime Minister Boris Johnson at the G7 Summit in Biarritz on Sunday. (ANI Photo)
607views

ఏడాది జరగబోయే జీ-7 సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని యునైటెడ్ కింగ్‌డమ్ ఆహ్వానించింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాకు కూడా ఆహ్వానం పంపింది. జూన్‌లో జరగబోయే ఈ సదస్సుకు బ్రిటన్‌ తీర ప్రాంతంలో ఉన్న కార్నవాల్‌ రిసార్ట్‌ వేదిక కానుంది. ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాల కూటమే ఈ జీ-7. ఈ సదస్సులో భాగంగా కరోనా వైరస్ మహమ్మారి, పర్యావరణ మార్పులు, సాంకేతికపరమైన అభివృద్ధి, శాస్త్రీయ ఆవిష్కరణలు, స్వేచ్ఛా వాణిజ్యంపై చర్చించనున్నారు.

అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతకు ఇది సూచిక : నిపుణులు

అయితే, ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను భారత్‌ ఆహ్వానించిన విషయం తెలిసిందే. కానీ, కరోనా కొత్త స్ట్రెయిన్‌ యూకేలో విజృంభిస్తుండడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే, జీ-7 సదస్సు కంటే ముందే భారత్‌లో పర్యటించే అంశాన్ని బోరిస్‌ పరిశీలిస్తున్నట్లు అక్కడి స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. 2020లో జరగాల్సిన జీ-7 సదస్సు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా అవి వాయిదా పడ్డాయి. 2019లో ఫ్రాన్స్ లోని బియారిట్జ్ లో చివరి సమావేశం జరిగింది. అయితే, జీ-7కు భారత్‌కు ఆహ్వానం అందడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఇది సూచిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.