
భారతీయ విజ్ఞాన మండలి (BVM) మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి (ANDHRAPRADESH STATE COUNCIL OF SCIENCE AND TECHNOLOGY) (APCOST) సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో 8,9 మరియు 10వ తరగతి విద్యార్థులలో ప్రతిభాన్వేషణలో భాగంగా క్విజ్ మరియు పోస్టర్ ప్రజెంటేషన్ పోటీ నిర్వహించనున్నారు. ఈ మేరకు భారతీయ విజ్ఞాన మండలి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ P.S.అవధాని ఒక ప్రకటన విడుదల చేశారు.
SCERT డైరెక్టర్ డాక్టర్ B. ప్రతాప్ రెడ్డి, APCOST సభ్య కార్యదర్శి శ్రీమతి ప్రొఫెసర్ Y. అపర్ణలు వేరు వేరు కార్యక్రమాలలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను, కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారిరువురూ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ, జిల్లాపరిషత్, మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కౌశల్ క్విజ్ లో పాల్గొనదలచినవారు 2021 జనవరి 31 లోపు www.bvmap.org వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ప్రాథమిక స్థాయి పరీక్ష ఫిబ్రవరి 9న, జిల్లా స్థాయి పరీక్ష ఫిబ్రవరి 16న, రాష్ట్ర స్థాయి పరీక్ష ఫిబ్రవరి 27న నిర్వహించనున్నట్లు తెలిపారు. విజేతలకు (టీం లకు) నగదు బహుమతి, సర్టిఫికెట్, జ్ఞాపిక అందజేస్తారని శ్రీ అవధాని తెలిపారు.
ఈ పోటీలలో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన టీంకు రూ.12,000 లు, అలాగే ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన టీమ్ లకు రూ.9000 లు, రూ.6000లు నగదు బహుమతులు అందజేయనున్నారు. అలాగే జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లలో రూ.6000లు ప్రథమ బహుమతి గానూ, రూ.4500లు, రూ.3000లు ద్వితీయ, తృతీయ బహుమతులుగానూ అందించనున్నారు.
వివరాలకు 9493313271, 9440507133, 9963922087 నంబర్లను సంప్రదించవలసినదిగా భారతీయ విజ్ఞాన మండలి ప్రతినిధులు తెలిపారు.





