News

హిందూ మహాసముద్రంలో నిఘా కోసం 10 డ్రోన్లను కొనుగోలు చేయనున్న భారత్

462views

హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిఘా కోసం భారత నావికాదళం క్రొత్తగా 10 స్వంత డ్రోన్లను కొనుగోలు చేయనుంది. ఇప్పటివరకూ అమెరికా డ్రోన్లను లీజుకు తీసుకొని వినియోగించుకున్న భారత నావికాదళానికి నూతనంగా 10 స్వంత డ్రోన్లు రానున్నాయి. ఈ క్రొత్త డ్రోన్ల కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన నిఘా సామర్థ్యాలను విస్తరించేందుకు నావికా దళానికి ఈ డ్రోన్లు ఎంతగానో ఉపకరిస్తాయి. ”భారత నావికాదళ అభ్యర్థన రక్షణ మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. ఈ మానవ రహిత వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ.1,300 కోట్లు వెచ్చిస్తోంది” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బై గ్లోబల్ కేటగిరీ కింద నేవీ ఓపెన్‌ బిడ్‌ ద్వారా ఈ డ్రోన్లను కొనుగోలు చేయనుంది. ”వీటిని సముద్రజాలల్లో నిఘా కోసం వినియోగిస్తారు. ముఖ్యంగా చైనీయుల కార్యకలాపాలతో పాటు ఇతరుల కదలికలు గుర్తించడంలో ఈ డ్రోన్లు ఎంతగానో ఉపకరిస్తాయి” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.