
ఇడుక్కిలోని కట్టప్పనాలో సిపిఎం యువజన విభాగానికి చెందిన DYFI స్థానిక నాయకుడి చేతిలో అత్యాచారానికి గురైన దళిత మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఎనిమిది రోజుల క్రితం తనకు తాను నిప్పంటించుకుంది. 60 శాతానికి పైగా కాలిన గాయాలకు గురైన బాధితురాలు శనివారం (31/10/2020) తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మరణించింది.
అక్టోబర్ 21 న ఇడుక్కి జిల్లాలోని సిపిఎం – డివైఎఫ్ఐ నాయకుడు మను మనోజ్ బాలికపై అత్యాచారం చేశారు. అతను నరియంపారాలో ఆటోరిక్షా డ్రైవర్ కూడా. ఈ నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తరువాత, అక్టోబర్ 23 న బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది.
ఈ సంఘటన తర్వాత పరారీలో ఉన్న కామ్రేడ్ మను మనోజ్ ను పోలీసులు అక్టోబర్ 24 న అరెస్టు చేసి, పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.
సమాచారం ప్రకారం సంఘటన తర్వాత అధికార CPMతో నిందితునికున్న రాజకీయ సంబంధాలు బహిర్గాతమవడంతో అతనిని DYFI నుండి తొలగించారు. ఇడుక్కి జిల్లాలోని డివైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ… నిందితునికి పార్టీలో సభ్యత్వం ఉన్నదని, కానీ అతను ఏ పదవులలోనూ లేడని వారు తెలిపారు.
Source : Organiser
https://www.organiser.org/Encyc/2020/11/2/Dalit-minor-girl-commits-suicide-after-being-raped-by-CPM-youth-wing-leader.html





