
భద్రతా దళాలు లష్కరే తోయిబాకు ఉగ్ర కార్యకలాపాలకు ఆర్ధిక సాయమందించిన బృందంలోని ఆరుగురు సభ్యులను అరెస్టు చేసి, జమ్మూ ప్రాంతంలో వారి భవిష్యత్ వ్యూహాలను విఫలం చేశామని అధికారులు తెలిపారు. ఆర్మీ అందించిన సమాచారం ప్రకారం ఈ కుట్రను పోలీసులు ఛేదించారు. “జమ్మూ నగరంలో లష్కరే తోయిబా కార్యకలాపాలను పునరుద్ధరించడానికి చేస్తున ప్రయత్నాల గురించి ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది” అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
లభించిన సమాచారం మేరకు, భద్రతా దళాలు ముద్దాసిర్ ఫారూక్ భట్ ను అదుపులోకి తీసుకున్నప్పుడు అతని దగ్గరున్న ఒక పెట్టెలో రూ.1.50 లక్షల నగదును గుర్తించారు. విచారణ సమయంలో ఆ నగదు లష్కరే తోయిబా కార్యకర్తలకు ఉద్దేశించినదని అంగీకరించాడు. భట్ తనకు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు ఆర్ధిక వనరులు సమకూర్చే ముఠాతో సంబంధం ఉందని అంగీకరించాడు. అలాగే ఇతర సభ్యుల గురించి కూడా సమాచారాన్ని వెల్లడించాడు.
ఆర్మీ మరియు పోలీసులు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు ఆర్ధిక వనరులు సమకూర్చే ముఠాలోని మరో ఐదుగురు సభ్యులను అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. వారిని మౌల్వి తౌకీర్ అహ్మద్ భట్, లొంగిపోయిన ఉగ్రవాది ఆసిఫ్ భట్, కాంట్రాక్టర్ ఖలీద్ లతీఫ్ భట్, ఖాటికా తలాబ్ (జమ్మూ) కు చెందిన గాజీ ఇక్బాల్, తారిక్ హుస్సియన్ మీర్ లుగా గుర్తించారు.
వీరంతా పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది మొహమ్మద్ అమీన్ భట్ అలియాస్ హరూన్ అలియాస్ ఉభైర్ కోసం పనిచేశారని ఆయన తెలిపారు. హారూన్ 1997 లో పాకిస్తాన్ నుంచి భారత్లోకి ప్రవేశించాడు. లష్కరే తోయిబాలో ఆయుధ శిక్షణ పొందిన తరువాత, అతను 2006 లో దోడాకు తిరిగి వచ్చాడు. అయినప్పటికీ, భద్రతా దళాల ఒత్తిడి కారణంగా, అతను పాకిస్తాన్ కు తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ నుండి తన ఉగ్రవాద మూకలకు ఆర్ధిక వనరులు సమకూర్చడం, ఉగ్రవాదుల నియామకాలను వంటి పనులను ప్రారంభించాడని త్జేలిపారు. నిందితులపై కేసు నమోదు చేశారని, దర్యాప్తు కొనసాగుతోందని ఆ అధికారి తెలిపారు.
Source : News 18.





