News

అస్సాం రైఫిల్స్‌ పై ఉగ్ర దాడి

771views

యన్మార్‌ సరిహద్దులో అస్సాం రైఫిల్స్‌ బలగాలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. మణిపూర్‌లోని చండేల్‌ జిల్లాలో జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. తొలుత ఐఈడీ పేల్చిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు ఆ తర్వాత కాల్పులు జరిపినట్టు సమాచారం. ఇంఫాల్‌ నుంచి దాదాపు 100 కి.మీల దూరంలో ఉన్న ఈ ఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.