
983views
ఇది మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్‌లో భారీ రావిచెట్టు చుట్టూ నిర్మించిన ఇల్లు. యోగేశ్ కేషర్వాణి అనే పర్యావరణవేత్త… తన తండ్రి నాటిన ఈ వృక్షాన్ని తొలగించడానికి ఇష్టపడక దీన్ని ఇలా నిర్మించారు. ఇప్పుడు ఆయన కూడా కాలం చేశారు. అయితేనేం! కుటుంబ సభ్యులు నిత్యం ఈ చెట్టును పూజిస్తూ, దానిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మేడపై దాని కొమ్మల కిందే సేదతీరుతున్నారు .






