News

సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ఘనంగా వెన్నెలకంటి జయంతి వేడుక

1.4kviews

ద్మభూషణ్ శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య 123 జయంతిని సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసతా వేదిక  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కోడూరు సత్యం, స్వర్గీయ వెన్నెలకంటి రాఘవయ్య గారికి ఘనంగా నివాళి అర్పించి, రాఘవయ్య గారు దేశానికి, గిరిజనులకు చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరూ శ్రీ రాఘవయ్య గారి అశయసాధన కోసం పని చెయ్యాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సామాజిక సమరసతా వేదిక ప్రధాన కార్యదర్శి శ్రీ బూదురుకేశవరామ్, శ్రీ ముప్పిరాల సుబ్రహ్మణ్యం, గిరిజన నాయకులు శ్రీ వేలూరు రంగారావు, శ్రీ సుధాకర్, శ్రీ బూదురు కరుణాకర్ తదితరులు పాల్గొని స్వర్గీయ రాఘవయ్య విగ్రహానికి పూలమాలలు వేశారు. గిరిజనోద్ధరణకై శ్రీ వెన్నెలకంటి చేసిన సేవలను వారందరూ ముక్త కంఠంతో కొనియాడారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.