
762views
కొవిడ్-19 చికిత్స కోసం తాము రూపొందించిన పాలీహెర్బల్ కాంబినేషన్ ‘ఆస్థా-15’ ఔషధ సామర్థ్యం, భద్రతను అంచనా వేయడానికి క్లినికల్ పరీక్షలు ప్రారంభించినట్లు దాల్మియా హెల్త్‌కేర్ గురువారం వెల్లడించింది. మల్టీ-సెంట్రిక్ మూడో దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించడానికి అన్ని నియంత్రణ మార్గదర్శకాలు అనుసరిస్తామని దాల్మియా గ్రూపు తెలిపింది. ‘కొవిడ్-19 పాజిటివ్ రోగులకు నయం చేయడానికి సహాయపడే మా అత్యంత సమర్థ ఆయుర్వేదిక్ సమ్మేళనం క్లినికల్ పరీక్షలు ప్రారంభించామ’ని దాల్మియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ సంజయ్ దాల్మియా వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ ఔషధాన్ని ఇప్పటికే చెన్నైలోని ప్రత్యేక ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్-19 రోగులపై పరీక్షించి అధ్యయనం చేశారు. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా కొవిడ్-19 చికిత్సకు ఈ ఔషధం తోడ్పడిందని అధ్యయనంలో తేలినట్లు సంస్థ పేర్కొంది.





