
జనాభా లెక్కల్లో తమ అసలైన మతాన్ని పేర్కొనవద్దని బోడోలను అసోం క్రైస్తవ మండలి హెచ్చరించింది. రాష్ట్రంలో జరగబోయే జాతీయ జనాభా లెక్కలలో, మతం మార్చుకున్న గిరిజన క్రైస్తవులు తమ అసలు మతాన్ని నమోదు చేసుకోకుండా బోడో క్రిస్టియన్ కౌన్సిల్ మరియు ఆల్ అస్సాం ట్రైబల్ క్రిస్టియన్ కౌన్సిల్ నిషేధించాయి.
AATBC కార్యదర్శి రెవరెండ్ సుశీల్ డైమరీ మాట్లాడుతూ.. క్రైస్తవ మతంలోకి మారిన బోడో ప్రజలు రాబోయే జనాభా లెక్కలలో తమ అసలైన మతమైన బథౌయిస్‌ను పేర్కొనకూడదని అన్నారు. గిరిజన క్రైస్తవులు తమను తాము క్రైస్తవులుగానే పేర్కొనాలని హెచ్చరించారు. దీనిని కాదని, అసలైన మతాన్ని వెల్లడిస్తే.. బైబిల్, యేసుక్రీస్తు ఆజ్ఞలను ఉల్లంఘించడమే అవుతుందని అది దేవుడిని తిరస్కరించినట్లుగా అవుతుందని బెదిరింపులకు దిగారు. డైమరీ ఒక అడుగు ముందుకేసి, “భూమి మీద నన్ను ఎవరైతే తిరస్కరిస్తారో, వారిని నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ఎదుట తిరస్కరిస్తాను అని యేసు బైబిల్‌లో వుందని ఉటంకించారు.
ఇది BNSలోని సెక్షన్ 318 మరియు IPCలోని సెక్షన్ 415లను కూడా ఉల్లంఘించడమేనని ఆయన గిరిజన క్రైస్తవులను హెచ్చరించారు. అంతేకాకుండా, దీనివల్ల రాష్ట్రంలోని క్రైస్తవ జనాభాకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని డైమరి పేర్కొన్నారు.
మరో వైపు రాబోయే 2027 జనాభా లెక్కల్లో తమ మాతృభాష, మత విశ్వాసాలను కచ్చితంగా పేర్కొనాలని గిరిజన సంఘాల సమన్వయ కమిటీ (CCTOA) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన వర్గాలను కోరింది.అస్సాం మూలవాసుల రాజకీయ, సామాజిక మరియు రాజ్యాంగపరమైన హక్కుల విషయంలో ఈ జనాభా గణన అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని CCTOA ప్రధాన సమన్వయకర్త ఆదిత్య ఖక్లారీ ఇటీవల పేర్కొన్నారు.
భారత ప్రభుత్వ అధికారిక గణాంకాలలో ఆదివాసీ ప్రజల ప్రాముఖ్యత నమోదయ్యేలా, రాబోయే జనాభా లెక్కల్లో గిరిజన వర్గాలన్నీ తమ మూల విశ్వాసాలను మరియు భాషను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి,” అని ఖఖ్లారీ అన్నారు.
CCTOA చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో, రాబోయే జనాభా గణనలో క్రైస్తవ జనాభా సంఖ్య తగ్గుతుందనే ఆందోళన క్రైస్తవ సంస్థలలో వ్యక్తమవుతోంది. తమ మూల విశ్వాసాలను ప్రోత్సహిస్తున్న వివిధ గిరిజన సంఘాల సమాచారం ప్రకారం, గతంలో వివిధ కారణాల వల్ల క్రైస్తవ మతంలోకి మారిన వందలాది గిరిజన కుటుంబాలు ఇప్పుడు తిరిగి తమ పూర్వీకుల విశ్వాసాలను స్వీకరించాలని కోరుకుంటున్నాయి.





