NewsProgramms

సమాజంలో సకారాత్మక పరివర్తన కోసం 15 లక్షల మంది స్వయం సేవకులు సక్రియం కావాలి – ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్

241views

ర్‌.ఎస్‌.ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎ.బి.పి.ఎస్) మూడు రోజుల వార్షిక సమావేశాలు మార్చి 15 నుంచి మార్చి 17 వరకు బెంగళూరులో జరుగనున్న సంగతి VSK పాఠకులకు తెలిసిందే.

ఈ రోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఈ అఖిల భారతీయ ప్రతినిధి సభ ఉద్దేశ్యాన్ని, వివరాలను ఆరెస్సెస్ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ వివరించారు.

గత సంవత్సరం, 30 ఏళ్లు పైబడిన స్వయంసేవకులకు సర్వే నిర్వహించబడిందని, ఇందులో 15 లక్షల మంది స్వయంసేవకులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. సర్వేలో వారివ్వగలిగే సమయం, వారి నైపుణ్యాలు మరియు వారికి ఆసక్తి ఉన్న అంశాల గురించి సమాచారం సేకరించబడిందని, సమాజంలో సకారాత్మక పరివర్తన తీసుకురావడానికి, సమాజ అవసరాలను తీర్చడానికి స్వయంసేవకులకు ఆసక్తి ఉన్న అంశాలకు అనుగుణంగా వారిని సక్రియం చేయడానికి చేపట్టవలసిన కార్యక్రమాల గురించి ఈ అఖిల భారతీయ ప్రతినిధి సభ(ఎబిపిఎస్)లో చర్చిస్తామని ఆయన వివరించారు.

అరుణ్ కుమార్, అఖిల్ భారతీయ ప్రచార్ ప్రముఖ్ మాట్లాడుతూ, “ఆర్ఎస్ఎస్ సంవత్సరానికి ఒకసారి అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్) లో కలుస్తుంది. ఇది ఆర్ఎస్ఎస్ యొక్క అత్యున్నత స్థాయి నిర్ణయాధికార సభ. ఈసారి ఈ వార్షిక సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ లో ఎన్నికైన 1500 మంది ప్రతినిధులు మరియు జాతీయ స్థాయిలో మహిళా ప్రతినిధులను కలిగి ఉన్న అనుబంధ సంస్థలు ఉంటాయి”. అని తెలిపారు.

ఆర్‌ఎస్‌ఎస్‌లో ‘వివిధ క్షేత్రాలు’ అని పిలువబడే 11 క్షేత్రాలు ఉన్నాయని, కార్య సౌలభ్యం కోసం విభజించబడిన మొత్తం 44 ప్రాంతాలలో వీటి కార్యక్రమాలు జరుగుతుంటాయని వివరించారు. విహెచ్‌పి (జస్టిస్ విష్ణు సదాశివ కొక్జే, అలోక్ కుమార్) ఎబివిపి (ప్రొఫెసర్ సుబ్బయ్య షణ్ముగం), భారతీయ మజ్దూర్ సంఘ్ (సాజీ నారాయణన్), విద్యా భారతి (రామకృష్ణ రావు), వనవరాసి జావి ), బిజెపి (జెపి నడ్డా), సక్షమ (దయాల్ సింగ్ పవార్) వంటి మొత్తం 35 పరివార క్షేత్రాల అధ్యక్షులు, కార్యకారిణి సభ్యులు 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.

“14 న జరిగే అఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశంలో ఎబిపిఎస్ ఎజెండాతో పాటు ప్రతిపాదించాల్సిన తీర్మానాలు నిర్ణయించబడతాయి.

మార్చి 15, ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఎబిపిఎస్ ప్రారంభమవుతుంది. మార్చి 17 వ తేదీ మధ్యాహ్నం సర్ కార్యవాహ శ్రీ సురేష్ భయ్యాజీ జోషి విలేకరుల సమావేశంలో ఎబిపిఎస్ వివరాలను, తీర్మానాలను వెల్లడించనున్నారు.” అని శ్రీ అరుణ్ కుమార్ తెలిపారు.

ఈ ఎబిపిఎస్ లో, గత సంవత్సరం ప్రణాళిక, అమలు,అనుభవాలు మరియు విజయాల యొక్క సమీక్ష జరుగుతుంది. వచ్చే ఏడాది ప్రాధాన్యతలను బట్టి అఖిల భారత కార్యకారిణి పర్యటన నిర్ణయమవుతుంది. దేశం మొత్తం మీద 96 చోట్ల జరిగే 20 రోజుల వార్షిక వేసవి శిక్షణ శిబిరాలకు అఖిల భారతీయ కార్యకర్తల పర్యటన కూడా ఖరారు చేయబడుతుంది.

ఈ పాత్రికేయుల సమావేశంలో అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ శ్రీ నరేంద్ర ఠాకూర్, దక్షిణ మధ్య క్షేత్ర (కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ) క్షేత్ర కార్యవాహ శ్రీ తిప్పేస్వామి, దక్షిణ కర్ణాటక ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ ప్రదీప్ లు కూడా పాల్గొన్నారు.

Source : Organiser.

https://www.organiser.org/Encyc/2020/3/13/RSS-to-activate-15-lakh-swayamsevaks-to-bring-about-positive-changes-in-society-Arun-Kumar.html

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.