News

దాపోలిలో హిందూ యువకులపై ముస్లింల దాడి..

3views

మహారాష్ట్రలోని దాపోలిలో ఇద్దరు హిందూ యువకులపై 15 మందికి పైగా తీవ్రవాద ముస్లిం యువకులు దారుణంగా దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గోవా కోట వద్ద ధూమపానం, మద్యం సేవించడం అభ్యంతరం చెప్పినందుకు హిందూ యువకులపై కక్ష పెంచుకుని ఇనుప రాడ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటనకు నిరసనగా హర్నాయ్ ప్రాంతంలోని హిందువులు భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చి రోడ్డుదిగ్బంధం చేపట్టారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ “న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదు” అని హెచ్చరించారు.

ఏం జరిగింది?
మే 26న హర్నాయ్‌లోని గోవా కోట ప్రధాన ద్వారం వద్ద జైన్ అస్లాం హునైర్‌కర్, ముఫిజ్ జావేద్ సోల్కర్ అనే ఇద్దరు ముస్లిం యువకులు సిగరెట్లు తాగుతూ, మద్యం సేవిస్తూ గట్టిగా నినాదాలు చేస్తున్నారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన చిన్మయ్ గురవ్, మహేంద్ర రఘువీర్ అనే ఇద్దరు హిందూ యువకులు కోట ప్రాంగణంలో ధూమపానం చేయవద్దని సూచించారు.

దీంతో ఆగ్రహించిన యువకులు హిందూ యువకులను దూషిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వారిని వెతికి మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, కోట ప్రాంతంలో ధూమపానం చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ చిన్మయ్ గురవ్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం తీవ్రవాద మూకలకు ఆగ్రహం తెప్పించింది.

మే 27 సాయంత్రం మళ్లీ గోవా కోటకు వెళ్లిన చిన్మయ్ గురవ్, మహేంద్ర రఘువీర్‌లను అదే యువకులు అడ్డగించి వీడియో గురించి నిలదీశారు. వెంటనే ఇనుప రాడ్లతో వారిపై దాడి ప్రారంభించారు. అక్కడ మేకలు మేపడానికి వచ్చిన మరికొందరు వ్యక్తుల్లో 10 నుండి 15 మంది వరకు ఈ దాడిలో చేరినట్లు సమాచారం.

దాడిలో ఇద్దరు హిందూ యువకులు తీవ్రంగా గాయపడగా, చిన్మయ్ గురవ్ మెడలో ఉన్న బంగారు గొలుసును కూడా దుండగులు లాక్కెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. గాయపడిన వారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ, ప్రధాన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. “హిందువులు తమ సంస్కృతి, చారిత్రక ప్రదేశాలను కాపాడాలని ప్రయత్నిస్తే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి” అంటూ స్థానిక హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.