
సంచార జీవనంతో భూమండలమంతా విస్తరించి క్రమంగా స్థిరనివాసిగా మారిన మానవుడు ఏ ప్రాంతంలో జీవికను వెదుకున్నా, కొద్ది తేడాలతో విశ్వమంతటా ఒకే తరహా అభిమతాన్ని అవలంబించా డనిపిస్తుంది. అదే మొత్తం మానవజాతికి వ్యక్తిత్వమై నిలిచింది. దాన్నే నిత్య నూతనము, సనాతనము అయిన ధర్మమన్నారు. అంటే సనాతనధర్మమే మొత్తం మానవాళికి వ్యక్తిత్వమై నిలిచింది యుగాల పర్యంతము. ఎడారి మతాలవారు ఎంతగా ధ్వంసం చేసినా గానీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మానికి చెందిన ఆనవాళ్లు త్రవ్వకాల్లో బయటపడడమే దీనికి తార్కాణం.
రష్యాలోని ఓల్గా(వాలుగ అనే సంస్కృత శబ్దం) నదితీరంలో 7వ శతాబ్ధికి చెందిన విష్ణుమూర్తి విగ్రహం, రోమ్‌లో ఏనుగు దంతంతో చేసిన లక్ష్మీదేవి ప్రతిమ, హంగేరిలో శివలింగాలు,వాటికన్‌లో సూర్య చిహ్నం,ఈజిప్ట్‌లో1900 ఏళ్లనాటి బుద్ధవిగ్రహంతో బాటు తెలుగురాజులైన శాతవాహనుల నాణెములు,
హిందీ/సంస్కృత శాసనము, మెక్సికోలో గణేషుడు, నాగ ప్రతిమలు, మధ్యఅమెరికాలో స్వస్తిక్ గుర్తులు, శివలింగాలు, సూర్య ఆరాధన ఆనవాళ్లు, ఈ యేడు జనవరిలో ప్రస్తుత పాక్లో లభించిన 1900 ఏళ్ల నాటి బంగారు నాణెంపై వ•డు ముఖాల శివుడు, నంది, త్రిశూలంతో ఉన్న చిత్తరువును బట్టిమొత్తం జగతిలో సనాతనధర్మమే ఉండేదని అర్థమవుతుంది. ఎడారి మతాలవారు ప్రపంచంలో ఎన్నో నాగరికతలను పూర్తిగా తొలగించినా హిందూధర్మాన్ని నాశనం చేయలేకపోయారు. హిందూధర్మపు ఆనవాళ్లను మరెన్నింటిని భూమాత తనలో దాచుకుందో!
ఇంతగొప్ప ధర్మానికి చెందిన మనం హిందువులుగా గర్వంగా తలెత్తుకొని తిరగగలుగుతున్నామా? గీతలో శ్రీ కృష్ణుడు చెప్పినట్టు స్వధర్మాన్ని పాటించక పరధర్మాల వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నాము. ఇతర మతాలనువారిని మితిమీరి గౌరవిస్తూ, మనల్ని మనం కించపరచుకోవడం కేవలం హిందువులపై రుద్దబడిన సెక్యులరిజం ప్రభావమా? అలాంటి నీచ స్థితికి ఎందుకు దిగజారాము?
ఐరోపా దేశాల్లో చర్చికి వెళ్లే వారి సంఖ్య తగ్గిపోవడంతో అనేక చర్చిలు గ్రంథాలయాలుగా, సాంస్కృతిక కేంద్రాలుగా మారిపోతున్నాయి. అమెరికాలో 30% మంది క్రైస్తవులుగా చెప్పుకోవడం ఇష్టం లేకుండా యోగా, ధ్యానం, ప్రకృతి ఆరాధన వంటి సనాతనధర్మ పద్ధతులు పాటిస్తున్నారు. ఇక్కడేమో ప్రజల సొమ్మును హిందూ గుళ్లకు కాకుండా చర్చిలు, మసీదుల నిర్మాణాలకు ప్రభుత్వాలు వెచ్చిస్తుంటే హిందువులుగా ఎందుకు ప్రశ్నించడం లేదు?
పైగా కేవలం హిందువుల గుళ్లనే వందేళ్లుగా అన్ని ప్రభుత్వాలు తమ హస్తాల్లో బంధించి కర్కశత్వం చూపెడుతుంటే, సనాతన ధర్మం కరోనా లాంటిదని దాన్ని అంతంచెయ్యాలనే వాళ్లు, దేవుడే లేడనే కవ్యనిస్టుల ఏలుబడిలో కూడా హిందూగుళ్ల ఆస్తులు దోచుకుంటుంటే, దోచి అన్యులకు పందేరం చేస్తుంటే హిందువులు ఎందుకు మౌనం వహిస్తు న్నారు? ధర్మరక్షణకే కదా దేవుడు అవతారాలు దాల్చడం, ప్రతి దేవీదేవతల చేతుల్లో ఆయుధాలు ఉండడం.
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదిగా తరాల నుండి అంది వస్తున్న వేదాలలో మొత్తం 1131 శాఖలకు గాను ప్రస్తుతం 11 శాఖలు మాత్రమే లభిస్తున్నాయని వేదపండితుల ఉవాచ. మరి అంతటి జ్ఞానాన్ని, ఆరు నుండి పన్నెండు మాసాల పాటు దహనం చేయబడ్డ నలంద విశ్వవిద్యాలయంలోని పుస్తకాలలో తిరిగి పొందలేని ఎంతో విజ్ఞానాన్ని హిందూ సమాజం ఎందుకు కాపాడుకోలేక పోయింది? ఆ వేదాల్లో ధర్మం గురించిన ప్రస్తావనలు అనేకచోట్ల కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనదేశ వేగుసంస్థ రా (=ఔ) నినాదంగా ఉన్న ‘‘ధర్మో రక్షతి రక్షితః’’ (ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది) వంటివాటి గురించి కూలంకషంగా వివరించడం జరిగింది.ధర్మం అర్థం విశాలమైనది. ‘‘సర్వేజనా సుఖినోభవంతు’’ అని సర్వ మానవాళి బాగుకోసం ఎలుగెత్తిన ధర్మం జగతిలో మరొకటి ఉందా?
ప్రాచీన కాలంలో ‘‘మత్’’ (ఆలోచించడం లేదా నమ్మడం) అనే సంస్కృత ధాతువు నుండి ఇప్పటి మతం అనే పదము పుట్టింది.దీనిని అభిప్రాయం, సిద్ధాంతం లాంటి పదాలకు ప్రత్యామ్నాయంగా వాడారు. ఇప్పటికీ ఒక విషయమై స్పర్థ ఏర్పడి చర్చిస్తుంటే ఎవరి మతాన్ని (అభిప్రాయాన్ని) వారు వెల్లడించమని కోరుతుండడం చూస్తుంటాము. మరోలా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని, ఆలోచనాసరళిని అనుసరించడమే ఇప్పటి మతం అనుకోవచ్చు. ధర్మానికి, లాటిన్ పదం’’ రెలిజియో’’ (=వశ్రీఱస్త్రఱశీ) నుండి పుట్టిన ‘‘రిలిజియన్’’ పదానికి ఎంతో తేడా ఉంది . ధర్మం విశాలమైన అర్థం కలిగిఉంటే మతం పరిమిత అర్థాన్ని కలిగి ఉంటుంది.
19వ శతాబ్దిలో బ్రిటీషర్లు మొదటిసారిగా విశాల హిందూదేశంలో జన గణన చేసినప్పుడు మతం అనే మాటను విస్తృతంగా వాడారు. అప్పటివరకు ఒక జీవన విధానంగా ఉన్న హిందూధర్మాన్ని హిందూ మతంగా వలసపాలకులు తెరపైకి తెచ్చారు. హిందువులది మతం కాదు ధర్మమేనని సోదా హరణంగా సర్వేపల్లి రాధాకృష్ణ, కొత్త సచ్చిదానంద వ•ర్తి వంటి ప్రఖ్యాత తత్వవేత్తలు ఎంతగా వివరించినా, హేతుబద్ధత లేని తప్పుడు ఆర్యద్రావిడ సిద్ధాంతం తీసుకొచ్చిన ఎడారిమతాల వారేకాదు హిందువులమని చెప్పుకొనే వారు కూడా వారితో విబేధిస్తుంటారు.
ఇతరులు తమ మతాలను బిలియన్ డాలర్లకొద్ది ఖర్చుచేస్తూ, అనేక వక్ర మార్గాలను అనుసరిస్తూ ప్రచారం చేసినట్టు హిందూ ధర్మం చేయలేదు. అయినా ముస్లిం, క్రైస్తవ మత ప్రచారకులు కూడా హిందువులుగా మారిన వైనం అబ్బురమనిపిస్తుంది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దికి చెందిన గ్రీకు రాయబారి హెలియో డోరస్ విష్ణు భక్తునిగా, ఇలా బెన్నెట్, డేవిడ్ ఫ్రాలీ,నివేదితగా మారిన ఐర్లండువాసి, వాసీమ్ రిజ్వి, మౌలి మహమ్మద్ ఆలీ, సన్వర్ హుస్సేన్, సయ్యద్ ఇబ్రహీం ఖాన్ వంటి ఎందరో తమ మతప్రచార వృత్తిని వదిలేసి హిందువులుగా మారారు. వీరు కాకుండా ఆఫ్రికా, ఐరోపా దేశాలకు, అమెరికాకు చెందిన సామాన్యులే కాకుండా అత్యంత ప్రముఖులు కూడా స్వచ్ఛందంగా హిందూధర్మాన్ని ఆచరించడమే కాకుండా ఆ విషయాన్ని బహిర్గతం చేస్తున్నారు.
ఇంత గొప్పదైన హిందూధర్మంపై ఎలక్ట్రానిక్ మాధ్యమాలు ఊపిర్లు పోసుకొన్నాక అదేపనిగా, అనుచితంగా తీవ్రమైన రీతిలో విరుచుకు పడుతున్నారు. వీరిలో హిందువులపేర్లు పెట్టుకొని హిందువులుగా చలామణి అవుతున్న వారి సంఖ్యకూడా తక్కువ కాదు.
హిందూధర్మంలో ఎక్కువ విషయాలు, రాజుగారి ఏడుగురు కొడుకుల చేపలవేట వంటి కథలు కూడా అన్నీ నర్మగర్బంగా వెల్లడి అయ్యాయి. నిజాయితీగా తరచిచూస్తే నుదుట ఎర్రటి కుంకుమ ధరించడం వంటి చిన్న విషయం నుండి అన్ని విషయాలు హేతుబద్ధంగా, శాస్త్రీయంగా ఉంటాయి. ప్రశ్నించ మని, ఏ వైపు నుండైనా జ్ఞానాన్ని పొందమని, గుడ్డిగా దేన్నీ నమ్మవద్దని బోధిస్తుంది హిందూ ధర్మం. శోధించి అసలు విషయాన్ని గుర్తెరగమంటుంది.వ్యక్తి అభిప్రాయాలకు, ఆలోచనలకు గౌరవం ఇస్తుంది. కాబట్టే రామాయణ కాలంలోని జాపాలి వంటి వారిని కూడా ‘‘విషవృక్షం’’ లా చూడక కించపరచడం చేయ లేదు. అన్ని రకాల భావాల వ్యక్తులు, సవ•హాలు హిందూధర్మంలో కనిపిస్తుంటారు. ఇతర ధర్మాల్లో లేని విభిన్నత్వం (ప్ల్యురలిజం) హిందూ ధర్మంలో ఉంది. వచ్చి తమను ఇబ్బందులకు గురి చేసిన అన్ని తెగలవారికి నీడనిచ్చి అక్కున చేర్చుకుంది. 1979లో వక్రమార్గంలో రాజ్యాంగంలో చొప్పించిన సెక్యులరిజం, సోషలిజం వంటివి హిందూ ధర్మానికి అతకవు. బహుశా అదే ధైర్యంతో 2008లో హిందూ తీవ్రవాదమంటూ ఆ పార్టీ సిగ్గులేకుండా తీవ్ర ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతుంటే, శత్రువులు నిర్భయంగా వచ్చి దేశ ఆర్థిక రాజధానితో సహా అనేకచోట్ల దాడులకు తెగబడ్డారు.
ప్రతి హిందువు తన ధర్మాన్ని పాటిస్తూ ఇతరులు తన పరిధిలోకి రాకుండా కట్టడి చేయాలి. ఇదిచేయక ఎడారి మతాల వారి వేషాలు ధరించి విందులు ఇస్తుంటారు. వారి ఆస్తులను కాపాడుతామని వాగ్దానాలు ఇస్తూ మన గుళ్ల ఆస్తులను యథేచ్ఛగా దోచేస్తుంటారు. ఇన్ని దశాబ్దాల్లో ఆ మతనాయకులు ఎవరైనా మన కట్టుబొట్టుతో మన పండుగలకు విందులు ఏర్పాటు చేశారా?
విపరీతమైన జాత్యహంకారం ఉన్నవాళ్లు హిందువులకు గుర్తింపు రాకూడదని హిమాలయాల ఎత్తు లెక్కించిన, రేడియోను అనేక మందులు కనుగొన్న హిందువులను కాదని వారివారికే ఘనతలను ఇచ్చుకొని ప్రచారం చేశారు.
తొలి పాఠశాల బ్రిటన్‌లో ఏర్పాటు అయినప్పటికే విశాల హిందూదేశంలో ఎనిమిది లక్షల విద్యాల యాలు గ్రామ స్థాయిలోకూడా వైభవంగా నడిచేవి. ప్రతి చోటా గుడిమాన్యం, బడిమాన్యం ఇచ్చేవారు. ఇతర మతాల వారు తమ మతవిద్యను ప్రభుత్వ ఖర్చుతో బోధించే బడులు నడుపుకోవచ్చు కానీ హిందువులకు ఆ వీలు కల్పించలేదు.ఆ విషయమై ప్రశ్నించక మార్కుల ర్యాంకులతో పిరికి మనస్తత్వం గల గుమస్తాలను తయారుచేసే విద్యవైపు మన పిల్లల్ని ఎందుకు నెడుతున్నాము?చిన్న సమస్యలకే ఉసురు తీసుకొనే వారి సంఖ్య ఎందుకు పెరుగుతోంది?
తమ ఆర్థిక సామాజిక స్థితి ఎలావున్నా ఎడారి మతాలవారు తమ పిల్లల చేత తమ మతగ్రంథాలను చిన్నప్పటినుండి చదివిస్తారు. హిందువుల్లో అలా తమ పిల్లల్ని పెంచేవారి శాతం బహు తక్కువగా ఎందు కుంటోంది? ఫలితంగా మన ధర్మం విషయాలపై ఏ మాత్రం అవగాహన లేని హిందువుల పిల్లలు ఇతర మతాల ఉచ్చుల్లో సులభంగా పడిపోతున్నారు. దేశంలోని అన్నిప్రాంతాల్లో, గొప్పసంస్థల్లో పనిచేసే ఎడారి మతాలకు చెందిన డాక్టర్లు, ఇంజనీర్లు కూడా ఈ మత మార్పిళ్లకు నిర్లజ్జగా బాహాటంగా పాల్పడుతున్నారు. చిన్న చిన్న ఊళ్లలో కూడా జిహాది బృందాలు, ఉగ్రవాద ముఠాలు తయారవుతున్నాయి. బట్టలిప్పి హిందువులుగా నిర్దారించుకొని కాల్చి చంపుతుంటారు. వాళ్లకు కొన్ని రాజకీయ పక్షాలు కూడా వత్తాసు పలుకుతుండడంతో మరింతగా రెచ్చిపోతున్నారు.ముస్లింలు ఒక రకమైన పద్ధతులు అనుసరిస్తుంటే క్రైస్తవులు మరో పంథా అనుసరిస్తు న్నారు.
శ్రీరాముని గుడిని సందర్శించ వెళ్లిన శాసన సభ్యునిపైనే దాడికి పూనుకునే స్థాయికి వెళ్లారు. చర్చిలను గుళ్లలాగా నిర్మించడం, ధ్వజ స్థంభాల్ని ఏర్పాటు చేయడం, గాయత్రి మంత్రం వంటి వాటిని వారి దేవునికి అన్వయిస్తూ పాడడం వీటిలో కొన్ని పోకడలు. ఇన్నీ చేస్తూ తాము హిందువుల్లోని ఎస్సీలమని చెప్పుకుంటూ అసలైన వారి సౌకర్యాలన్నీ తేరగా పొందుతూంటారు. అన్ని విధాలుగా హిందువు లను ఇబ్బందులకు గురిచేస్తూ, ఎగతాళి చేస్తూకూడా తమకు ఈదేశంలో మతస్వేచ్ఛలేదంటూ గోల చేస్తుంటారు. వీళ్లకు బయటి దేశాలు వత్తాసు పలుకుతూంటాయి.
సరస్వతీ మందిరాన్ని కూడా ధ్వంసం చేసిన వర్గపు వ్యక్తి అదే శారదను, ద్రౌపదిని నగ్నంగా చిత్రీకరిస్తే, అతడిని పెద్దల సభలో కూర్చోపెట్టిన ఘనసమాజం మనది. సినిమాల్లో మన పురాణాలను వక్రీకరించినా, దేవుళ్లను ఎంతగా కించపరచినా మనం స్పందించం.
ఇదే తరహాలో హిందూ సమాజానికి సెక్యుల రిజం పేరుతో దాని ఉనికినే ప్రశ్నించే ప్రమాదకర పరిస్థితులు కొనసాగితే, ఎడారి మతాలవారు రెచ్చిపోతుంటే జగతిలో ఉండే ఏకైక హిందూస్థావరం కూడా అంతమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు. వ్యక్తిత్వం కోల్పోతున్న హిందూసమాజం ఇప్పుడైనా, ఇకనైనా జాగృతి అవుతుందా? మనలోని అంతర్గత శత్రువులతోనే కాదు, హిందూదేశంలోని రకరకాల పేర్లతో చెలామణి అవుతూ, దేశాన్ని ఇస్లాం దేశంగానో, ఏసురాజ్యంగానో మార్చేస్తామనే అంతర్గత శత్రువులతో హిందువులు ఇకనైనా జాగ్రత్త వహిస్తారా?
గడ్డం దేవీప్రసాద్
8971830473





