News

ముస్లింలతో అజిత్ దోవల్ కీలక భేటీ

5views

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. ముస్లిం మేధావులతో కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వాన మేరకు కొత్త పీఎంవో భవనంలో 14 మంది ముస్లిం సభ్యుల ప్రతినిధి బృందంతో సమావేశం అయ్యారు. పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు ఈ సమావేశంలో ఉన్నారు.

ముస్లిం మేధావులతో దాదాపు గంటన్నర పాటు అజిత్ దోవల్ సమావేశం అయ్యారు. మేధావులు చెప్పిన విషయాలను అజిత్ దోవల్ చాలా శ్రద్ధగా ఆలకించారు. అనంతరం తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సమావేశం అనంతరం మేధావుల సమావేశానికి నేతృత్వం వహించిన పారిశ్రామికవేత్త, విద్యావేత్త జాఫర్ సరేష్‌వాలా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆహ్వానం ఒక సానుకూల సంకేతమని అన్నారు. ‘‘భారతదేశం ఒకే పడవ.. మనమందరం కలిసి ప్రయాణిస్తాము లేదా కలిసి మునిగిపోతాము.’’ అని అజిత్ దోవల్ తమతో స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. దేశంలో మత ఐక్యత ఉండాలని దోవల్ నొక్కి చెప్పారని పేర్కొన్నారు.