
71views
వివిధ పద్ధతులలో హిందూ అమ్మాయిలను వలలో వేసుకోవడం, లవ్ జిహాద్ లాంటి ఘటనలపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే హిందూ మహిళలను వలలో వేసిన తర్వాత, మత మార్పిళ్లకు పాల్పడటం లాంటి కేసులు పెరుగుతున్నాయని, వీటిని పూర్తిగా అరికట్టాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే డిమాండ్ చేశారు.
కేరళలోని ఎర్నాకులంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మత మార్పిళ్లు, లవ్ జిహాద్ ఇప్పుడు దేశ వ్యాప్త విపత్తుగా పరిణమించాయని అన్నారు. ఈ విపత్తుకు కేరళలోని ధార్మిక సమాజం అత్యంత బాధితురాలిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు – జిహాదీ కూటమి కారణంగా కేరళ లవ్ జిహాదీలకు స్వర్గధామం అయిపోయిందని, ఈ మహమ్మారిని నిర్మూలించడానికి, అక్రమ మతమార్పిళ్లకు అడ్డుకట్ట వేయడానికి వెంటనే ఓ చట్టం తేవాలని డిమాండ్ చేశారు.
జిమ్ జిహాద్, ట్యూషన్ జిహాద్, కోచింగ్ జిహాద్, యూపీఎస్సీ జిహాద్ వంటివి పుట్టుకొస్తున్నాయని, తాజాగా కేజీఎంయూ మరియు అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయాల్లో జరిగిన సంఘటనలు, తాజాగా నాసిక్ టీసీఎస్ లోజరిగిన ఘటన ఇప్పుడు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని అన్నారు. అలాగే ఇలాంటి ఘటనలు ఇప్పుడు మరిన్ని కార్పొరేట్ సంస్థల్లో కూడా జరుగుతోందన్న రిపోర్టులు వస్తున్నాయని అన్నారు. ఇంత జరుగుతున్నా.. ముస్లిం సంస్థలు, వారి నాయకులు మౌనంగా వున్నారని, దీంతో యావత్ ముస్లిం సమాజాన్ని అనుమానాల నీడలోకి నెట్టేస్తోందన్నారు. ఈ ఘటనపై ముస్లిం సమాజం కచ్చితంగా స్పందించాలని డిమాండ్ చేశారు.
మరో వైపు టీఎస్ లాంటి ఘటనలు, కొన్ని కార్పొరేట్ సంస్థల్లో కూడా జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తున్నాయని, హిందూ మహిళలకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణాన్ని కల్పించే దిశగా కృషి చేయాలని ,ఈ విషయంలో త్వరలోనే తాము అన్ని కార్పొరేట్ కంపెనీలన్నింటినీ సంప్రదిస్తామని మిలింద్ పరాండే ప్రకటించారు.
ఇక.. మధ్యప్రదేశ్ లోని గిరిజన వర్గానికి చెందిన ఓ మైనర్ హిందూ బాలికను ఓ జిహాదీ కేరళకు తీసుకొచ్చాడని, ఈ సమయంలోనే అతనికి రాజకీయ అండ లభించిందని, దీనిని ఖండిస్తున్నామని తెలిపారు. రిజన వర్గానికి చెందిన ఆ మైనర్ బాలికను రక్షించడానికి బదులుగా, ఆమెను దోపిడీ చేస్తున్న ఆ నేరస్తుడికి రక్షణ కల్పించడం ద్వారా సీపీఎం తన నిజస్వరూపాన్ని చూపించిందన్నారు.
ఇక.. హిందూ దేవాలయాలపై కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఎప్పుడూ తప్పుడు విధానాలనే అవలంబిస్తున్నాయని, దీంతో హిందూ సమాజం తీవ్రంగా మనస్తాపానికి లోనవుతోందని పేర్కొన్నారు.ఇకపై, దేవాలయ నిధులను జిహాదీ, క్రైస్తవ లేదా లౌకిక కార్యకలాపాల కోసం ఖర్చు చేయడానికి హిందూ సమాజం అనుమతించదని పరాండే తేల్చి చెప్పారు.





