News

ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్

59views

బాలీవుడ్ నటులు రణవీర్ సింగ్ నటించిన ‘‘ధురంధర్2’’ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను సాధిస్తోంది. ధురంధర్ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న రణవీర్ సింగ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్‌ను మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

నివేదికల ప్రకారం, రణవీర్ సింగ్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడే ఆయన గంటన్నర పాటు గడిపారు. ఈ సమావేశంలో మోహన్‌ భగవత్‌తో తన లెటెస్ట్ మూవీ ధురంధర్ విశేషాలను పంచుకున్నారు. ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు, క్షేత్రస్థాయి కార్యక్రమాలను గురించి తెలుసుకున్నారు. ప్రధాన కార్యాలయం తర్వాత, రేషింబాగ్‌లోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిరాన్ని కూడా సందర్శించారు. అక్కడ ఆయన ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ గారు, గురూజీ ఎం.ఎస్. గోల్వాల్కర్‌లకు నివాళులర్పించారు.