News

పాఠశాలల్లో పూర్తి ‘వందేమాతరం’ ఆలపించాలన్న నిర్ణయాన్ని సమర్థించిన కర్ణాటక హైకోర్టు

113views

పాఠశాలల్లో ప్రతిరోజూ ఆరు చరణాలతో కూడిన పూర్తి ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. కేంద్ర ప్రభుత్వ   నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొంతకాలం క్రితం కొట్టివేసింది.

బెంగళూరుకు చెందిన న్యాయవాది సోమశేఖర్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి విభా బఖ్రూ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అరవింద్ కామత్ వాదనలు వినిపించారు. ఇదే డిమాండ్‌తో దాఖలైన ఇలాంటి పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవలే కొట్టివేసిందని ఆయన బెంచ్ దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.