News

టిటిడి పాలకమండలి సభ్యుడి కుటుంబం అన్యమత ప్రార్థనలు

73views

తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలిలో మరో కొత్త వివాదం రాజుకుంది. బోర్డు సభ్యుడు ఆర్.ఎన్. దర్శన్ కుటుంబం క్రైస్తవ మతాన్ని ఆచరిస్తోందంటూ తిరుక్షేత్రాల రక్షణ సమితి సంచలన ఆరోపణలు చేసింది. హిందువుల పవిత్ర క్షేత్రమైన తిరుమల పాలకమండలిలో అన్యమతస్థులు కొనసాగడం నిబంధనలకు విరుద్ధమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని సమితి ప్రతినిధులు మండిపడుతున్నారు దర్శన్ భార్య గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలను రక్షణ సమితి బహిర్గతం చేశారు.

ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తక్షణమే స్పందించాలని, దర్శన్‌ను బోర్డు నుంచి తొలగించాలని తిరుక్షేత్రాల రక్షణ సమితి ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం బోర్డు సభ్యులుగా ఉండేవారు తప్పనిసరిగా హిందూ మతావలంబీకులై ఉండాలని.. అధికార యంత్రాంగం ఈ ఆరోపణలపై విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

https://x.com/i/status/2042851610196611550

మరోవైపు చర్చి ప్రార్థనల్లో దర్శన్ కుటుంబం పాల్గొన్నట్లు ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పరమ పవిత్రమైన టీటీడీ బోర్డులో హిందూ ధర్మంపై నమ్మకం లేని వారికి చోటు కల్పించడం ఏంటని నెటిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు