News

27న రాష్ట్ర వ్యాప్తంగా గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్

84views

గో వధను అరికట్టి.. గోమాతకు తగిన గౌరవం, స్థానాన్ని తిరిగి కల్పించడమే లక్ష్యంగా గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ (గో గౌరవ ఆహ్వాన ఉద్యమం) పేరుతో ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉద్యమ ప్రతినిధులు వెల్లడించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోవత్ కిరణ్ కృష్ణ, హరిసింగ్, కృష్ణ మాట్లాడారు. ఈ ఉద్యమానికి ఏ వ్యక్తి.. లేదా సాధువులు నాయకత్వం వహించడం లేదని చెప్పారు. నిర్దాక్షిణ్యంగా వధకు గురవుతున్న సుమారు 80వేల గోవుల ప్రాణాలను రక్షించాలని, భారత ప్రభుత్వం కఠిన మైన చట్టం తీసుకురావాలని వారు డిమాండ్చేశారు. ఆ రోజు ప్రజలంతా తమ తమ మండల కేంద్రాల్లోని అధికారులకు వినతిపత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు. సంతకాల సేకరణ నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి సంతకాలు చేసి.. ఆ పత్రాలను ప్రభుత్వ అధికారులకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. గోవును జంతువుగా కాకుండా.. మన సంస్కృతికి మూలమైన రాష్ట్ర మాతగా గుర్తించాలని వారు కోరారు.