
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచల మండలం కాకుటూరు పంచాయతీ గొలగమూడి రోడ్డులో అక్రమంగా సంత నిర్వహిస్తూ తద్వారా పశువులను చెన్నై కేంద్రంగా గోవదశాలలకు తరలిస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన స్థానికనాయకులతో కలిసి అక్రమంగా నడుస్తున్న పశువుల సంతను పరిశీలించారు.
ప్రైవేట్ స్థలంలో నిబంధన లేకుండా…
అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ స్థలంలో నిబంధన లేకుండా సంత నిర్వహణ సాగుతుందని ఆయన ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా గోవులను తరలిస్తున్నారని మాజీ మంత్రి అన్నారు. ఈ పశువులు సంత వ్యాపార కోసమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉందన్నారు. కలెక్టర్, ఎస్పీ తోపాటు పంచాయతీ అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్య చేపట్టాలని మాజీమంత్రి కోరారు.
Next Story





