News

వాగు ఒడ్డున పురాతన ఆంజనేయస్వామి విగ్రహం

103views

పల్నాడు జిల్లా రొంపిచర్ల స్థానిక చపారపు సుబ్బారెడ్డి కాలనీ సమీపంలోని చప్టా వద్ద పురాతన కాలం నాటి ఆంజనేయస్వామి విగ్రహాన్ని స్థానికులకు కనుగొన్నారు. విగ్రహం ఆనవాళ్లతో పురాతనమైనదిగా భావిస్తున్నారు. మూడు రోజుల కిందట రాత్రి సమయాల్లో జేసీబీ ఆ ప్రాంతంలో సంచరించటం స్థానికులు చూశారు. విగ్రహం ముఖ భాగం కనిపించకుండా ఉండటంతో స్థానికులు తొలుత దానిని రాయిగా భావించారు. శుక్రవారం గ్రామస్తులు కొందరు రాయిని దొర్లించగా విగ్రహం కనిపించింది. విగ్రహం ముక్కు, ఛాతీ, మొఖం, గధ ప్రాంతాల్లో దెబ్బతిన్నట్లు గుర్తించారు. జేసీబీ బక్కెట్‌లో విగ్రహాన్ని ఉంచి ఇక్కడకు తీసుకొచ్చి పడవేసినట్లు భావిస్తున్నారు. ఆ సమయంలోనే విగ్రహం ధ్వంసం అయినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు ఆ విగ్రహాన్ని గుడిలోకి చేర్చి పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.