News

రామభక్తులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : రఘరామ

83views

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు రామాలయం వద్ద తనపై హత్యాయత్నం జరిగిందని, ఘటన కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఆకివీడు రామాలయాన్ని ఓ వర్గం వ్యతిరేకిస్తోందని, ఆ విషయంలో ఎప్పటి నుంచో వివాదం ఉందని తెలిపారు. అయితే వారంతా హిందువులేనని, కానీ వేరే మతం పేరుతో కొనసాగుతున్నారని చెప్పారు. అందువల్లే అక్కడ రామాలయాన్ని వద్దని, కనీసం శుభ్రం చేసినా వాళ్లు ఒప్పుకోవడం లేదని తెలిపారు.

ఆకివీడులోకి బయట వాళ్లు
గురువారం సాయంత్రమే బయట వాళ్లు ఆకివీడు గ్రామంలోకి వచ్చారని, ముందుగా ప్లాన్ చేసి రాళ్లు, కత్తులు, మేకులతో తనపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. వారిలో కొందరిని గుర్తించానని చెప్పారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న రామాలయం వద్ద శ్రీరామనవమి రోజు ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనను ఆదిలోనే అరికట్టాలని, లేనిపక్షంలో వికృతి వెర్రితలలు వేస్తుందని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.