
భారతదేశాన్ని 2047 నాటికి విశ్వగురు స్థానంలో నిలపడమే తమ ధ్యేయమని.. అందుకోసం అహర్నిశలు శ్రమిస్తామని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – ఆర్‌ఎస్‌ఎస్ ఖండ కార్యవాహక కార్యదర్శి ఎం.గణపతి అన్నారు. పార్వతీపురంమన్యం జిల్లా బాడంగి స్థానిక మెయిన్‌రోడ్డుపై నిర్వహించిన పద సంచలనం భారతమాత జెండాలు పట్టుకుని ఆదివారం ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక స్వామి కల్యాణ మంటపంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్‌ను రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ దేశం, ధర్మం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. శాంతి, సామరస్యం మరియు మానవ-కేంద్రీకృత విధానం ద్వారా, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను చూపడంలో భారతదేశం తన ప్రాచీన సంస్కృతిని, విలువలను ధర్మం అనుసరిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వయంసేవకులు బేతనపల్లి శంకరరావు, అంబటి గణపతి, లగుడు పరశునాయుడు, తదితరులు పాల్గొన్నారు.





