News

సమాజంలో ఉపాధ్యాయుడిది గురుతరమైన బాధ్యత

80views

నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం – APUS రాష్ట్ర అధ్యక్షులు శ్రీ యస్ బాలాజీ గారి పర్యటన సందర్భంగా స్థానిక భారతమాత గుడి ప్రాంగణంలో గల విశ్వహిందూ పరిషత్ సమావేశ భవనం లో అన్ని మేనేజ్ మెంట్ లందు పనిచేసే ఉపాధ్యాయులచే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

జిల్లా అధ్యక్షులు శ్రీ ఎంఎం విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన వేదిక పై రాష్ట్ర అధ్యక్షులు శ్రీ యస్ బాలాజీ , రాష్ట్ర సహా కోశాధికారి శ్రీ కృష్ణార్జున రెడ్డి, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ టీ వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి బాలమణి ఆసీనులయ్యారు.

యధావిధిగా భారతమాత పూజ, దీపారాధన, మాలార్పణ తదుపరి సభా కార్యక్రమాలు ప్రారంభ మయ్యాయి.వివిధ మేనేజ్మెంట్ లలోని ఉపాధ్యాయులు తమ తమ సమస్యలను వివరించారు.

రాష్ట్ర సహ కోశాధికారి శ్రీ కృష్ణార్జున రెడ్డి మాట్లాడుతూ, సరిహద్దుల్లో సైనికుల కెంత బాధ్యత ఉందో, అంతకంటే ఎక్కువ బాధ్యత సమాజ చైతన్యంలో ఉపాధ్యాయు లకు అంతకంటే ఎక్కువ బాధ్యతే ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లో జరిగిన పౌర అసంతృప్తిని వివరిస్తూ, అంతకంటే భారీస్థాయిలో పౌర అసంతృప్తిని రగిలించటానికి, విదేశీ ప్రేరిత విష నాగులు మన దేశంలో కాచుకుని ఉన్నాయని, వాటి నుండి భరత మాతను కాపాడి అఖండ భరత మాతను విశ్వ గురు స్థానానికి నడిపించ వలసిన బాధ్యత సమాజంలో గురు స్థానలో ఉన్న మనందరిదీ అని తెలిపారు.

అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ యుద్దం కారణంగా నెలకొన్న, నెలకొన బోతున్న ఇంధన సంకట సమయంలో ఇందన పొదుపును పాటించడం కూడా దేశభక్తే అని తెలియ జేశారు.

ఉపాధ్యాయులు వారి సమస్యల పట్ల, రాష్ట్ర ఆర్థిక స్థితి గతులు పట్ల విస్తృత అవగాహన ఉన్న రాష్ట్ర అధ్యక్షులు అందరి సమస్యలను స్పృశిస్తూ, వాటిని సాధించేందుకు సంఘ్ పరంగా వారు చేస్తున్న సంప్రదింపు లను, వారు చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు.

మీ సమస్యలను మాకు వదిలి మీ విద్యుక్త ధర్మాన్ని మీరు సక్రమంగా నిర్వహిస్తూ, విద్యార్థుల లో, సమీప సమాజంలో దేశభక్తి, ధర్మ నిష్ఠ, ఐక్యత, సమరసత, పర్యావరణం పట్ల అవగాహన, పౌర విధులు పట్ల సరైన దృక్పథం కోసం కృషి చేసి మాతృదేశ ఔన్నత్యం కోసం శ్రమించాలని పిలుపు నిచ్చారు.

సదరు కార్యక్రమంలో రాష్ట్ర మీడియా ఇంచార్జ్ శ్రీ మల్లికార్జున, శ్రీ జి బాలయ్య, శ్రీ పినాకపాణి, జిల్లా,మండల కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.