
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పేరుతో AI ద్వారా సృష్టించిన నకిలీ పోస్ట్ పై ఆరెస్సెస్ అప్రమత్తమైంది. వీడియోపై ఆరెస్సెస్ గౌహతి మహా నగర్ సంఘచాలక్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. AI ని ఉపయోగించి ఓ నకిలీ పోస్ట్ ను, తప్పుదోవ పట్టించే పోస్ట్ ను సృష్టించి, దానిని ఆరెస్సెస్ కి తప్పుగా ఆపాదిస్తూ, ప్రచారం చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కంటెంట్ అంతా కూడా అత్యంత అసత్యమైందని, దురుద్దేశపూరితమైందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ కంటెంట్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, సంఘ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని అన్నారు.
దీంతో తక్షణమే జోక్యం చేసుకోవాలని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కల్పితంగా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దురుద్దేశంతో ఇలాంటి నీతిమాలని కార్యకలాపాలు చేస్తున్నారని, ప్రజా సామరస్యానికి భంగం కలిగిస్తుందన్నారు. విస్తృత జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వాటిని తక్షణమే అణచివేయాలని సూచించారు.





