News

గో ఆధారిత వ్యవసాయం ఉత్తమం

82views

పూర్వీకులు మనకు సారవం తమైన నేలను వారసత్వంగా ఇస్తే దానిని మనం విషతుల్యం చేస్తున్నామని.. గో ఆధారిత వ్యవసాయం ఉత్తమం అని దాన్ని ఉత్తేజవంతంగా చేసే భాధ్యత మనపై ఉంది’ అని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మార్కెట్‌యార్డులో ఈనెల 22 వరకు నిర్వహించే గోవుల పాల, అందాల పోటీ లను ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ పోటీల్లో పుంగునూరు ఆవులు 24, గిత్తలు 16, ఒంగోలు ఆవులు 45, గిత్తలు ఆరు మొత్తం 91 ఆవులు, గిత్తలు పాల్గొన్నాయి. ప్రతీ ఏటా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ద్వారకా తిరుమలలో జరిగే పోటీలకు విశేష స్పందన ఉందని ఎమ్మెల్యే తెలిపారు. పోటీల నిర్వాహకులు, గోజాతి సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు యు.చక్రపాణి, ఏఎంసీ చైర్మన్‌ వై.బ్రహ్మరా జును వారు అభినందించారు.