News

అట్టుకల్ పొంగళ్ సమర్పించిన నటి రెనీషా రెహీమ్.. ముస్లిం మతోన్మాదుల ట్రోలింగ్

104views
మలయాళ బుల్లితెర నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రెనీషా రెహీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. కేరళలోని ప్రసిద్ధ ‘అట్టుకల్ పొంగళ’ వేడుకలో ఆమె పాల్గొనడమే ఇందుకు కారణమైంది. ముస్లిం మతానికి చెందిన రెనీషా, హిందూ సంప్రదాయం ప్రకారం పొంగళ సమర్పించడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.
ప్రతి ఏటా తిరువనంతపురంలోని అట్టుకల్ భగవతి ఆలయం వద్ద లక్షలాది మంది మహిళలు పొంగళ సమర్పిస్తారు. ఈ ఏడాది మార్చి 3న జరిగిన ఈ వేడుకలో రెనీషా రెహీమ్ కూడా పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి, భక్తిశ్రద్ధలతో పొంగళ వండుతున్న ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. “నా మొదటి అట్టుకల్ పొంగళ.. ఈ అనుభవం చాలా బాగుంది” అంటూ ఆమె పెట్టిన పోస్ట్ వివాదానికి కేంద్ర బిందువైంది.
రెనీషా పోస్ట్ కింద కొందరు నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రంజాన్ మాసంలో, ముస్లిం అయి ఉండి ఇలాంటి పనులు చేయడం ఏమిటి?” “మతం మారిపోవచ్చు కదా?” “ఇలాంటి పనులు ఇస్లాంకు విరుద్ధం” అంటూ పోస్టులు పెట్టారు.
తనపై వస్తున్న విమర్శలకు రెనీషా గట్టిగానే బదులిచ్చారు. తాను ఏ తప్పు చేయడం లేదని, భక్తి అనేది వ్యక్తిగత విషయమని ఆమె స్పష్టం చేశారు.
నేను మతం మారడం లేదు. ఇది నా వ్యక్తిగత ఇష్టం. ఇతరుల అభిప్రాయాలను నేను ఎందుకు పట్టించుకోవాలి? నాకు నచ్చిన విధంగా జీవించే హక్కు నాకుంది” అని ఆమె ధీటుగా సమాధానమిచ్చారు.
చిన్మయ విద్యాలయంలో చదువుకున్నానని, గాయత్రి మంత్రం, భగవద్గీత నేర్చుకున్నానని రెనీషా ఓ వీడియోలో పేర్కొంది.
ఈ పోస్టుకు కామెంట్ చేసిన వాటిలో కొన్ని పోస్టులు నిజంగా ఆసక్తికరంగా , ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. నెటిజన్లు ఒకరు, “హిందూ అమ్మాయిలు హిజాబ్ ధరించినప్పుడు, హిందువులు రంజాన్ ఉపవాసం పాటించినప్పుడు, హిందూ దేవాలయాలలో రంజాన్ (సాయంత్రం) అల్పాహారం తీసుకున్నప్పుడు హిందువులు తమ లౌకిక ఆధారాలను నిరూపించుకోవడానికి గొడ్డు మాంసం తిన్నప్పుడు మాత్రమే ‘నిజమైన కేరళ కథ’ వాస్తవికంగా ఉంటుందా? ఎవరైనా దానికి విరుద్ధంగా చర్యలు తీసుకుంటే తప్పు ఏమిటి? ఒక హిందూ నటి ఇస్లామిక్ ఆచారంలో పాల్గొని ఉంటే, వందలాది మంది దానిని ‘నిజమైన కేరళ కథ’గా చూపించేవారు ముఖ్యమంత్రితో సహా చాలా మంది దానిని పంచుకునేవారు. ఇప్పుడు, ‘ది కేరళ స్టోరీ’ కేవలం ప్రచార చిత్రం కాదని స్పష్టంగా తెలియదా?” అంటూ కామెంట్ చేయడం చాలా ఆలోచింపచేసేలా ఉంది.