News

ఆగని గోమాతల తరలింపు

91views

అధికారులు, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పశువుల అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. వారి కళ్లుకప్పి అక్రమ రవాణాదారులు యథేచ్ఛగా పశువులను తరలిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస వైపు నుంచి శ్రీకాకుళం వైపు ఆవు లను అక్రమంగా తరలిస్తున్న లారీలో ఒక ఆవు మృతి చెందింది. ఎవరైనా లారీ పట్టుకుంటే కేసు అవుతుందన్న భయంతో అక్రమ రవాణాదారులుకోటబొమ్మాళి హరిశ్చంద్రపురం జంక్షన్‌ వద్ద జాతీయ రహ దారికి ఆనుకొని ఉన్న సాగునీటి కాలువలో చనిపోయిన ఆవును పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. నీటిలో తేలిన ఆవు కళేబరాన్ని ఉదయం స్థానికులు చూసి ‘అయ్యో గోమాత… నీకు ఎం తకష్టం వచ్చిందని’ వాపోయారు. ఇప్పటికైనా పోలీసులు, అధికారులు స్పందించి పశువుల అక్రమ రవాణాదారులపై కేసులు నమోదు చేసి శిక్షించాలని కోరుతున్నారు.