
సీఏఏ కింద ఉత్తరాఖండ్ కి సంబంధించిన 162 మంది హిందూ శరణార్థులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారత పౌరసత్వం మంజూరు చేసింది. హరిద్వార్ వేదికగా జరిగిన బహిరంగ సభలో కేంద్ర హొంమంత్రి అమిత్ షా పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.హోంమంత్రి అమిత్ షా సంకల్పం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత కారణంగా ఈ పౌరసత్వ ధృవీకరణ పత్రాలు అందించామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అన్నారు.
బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చి దాదాపు రెండు వందల మంది హిందువులు ఉత్తరాఖండ్‌లో ఆశ్రయం పొందారు.పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి పొరుగు దేశాలలో మతపరమైన హింసను ఎదుర్కొని, ప్రస్తుతం మన దేశంలో ఆశ్రయం పొందారు.
సీమా జాగరణ్ మంచ్ దే కీలక పాత్ర
సీమా జాగరణ్ మంచ్ చీఫ్ రిటైర్డ్ కల్నల్ అజయ్ కోథియాల్ మరియు అతని బృందం ఈ హిందూ శరణార్థుల నుండి ఫారాలను నింపి, పత్రాలను సేకరించి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భారత ప్రభుత్వానికి పంపారు, అందులో 162 మందికి భారత పౌరసత్వం లభించింది.వీరికి పౌరసత్వం లభించడం అత్యంత భావోద్వేగపరమైన అంశమని కల్నల్ కోథియాల్ పేర్కొన్నారు.





