News

కాళ్లకు కట్టెలతో శ్రీశైలానికి పాదయాత్ర

85views

కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లా హనుగుంద తాలుకా అమ్మెనోగాడ్‌గ్రామానికి చెందిన బసవప్రియ కాళ్లకు రెండున్నర అడుగుల పొడవాటి కట్టెలను కట్టుకొని ఈ నెల 4న 460 కి.మీ.దూరంలోని శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరారు. అదే జిల్లా రబికవిద్యనహట్టి తాలూకా హళింగలి గ్రామానికి చెందిన రమేశ్‌ కూడా శ్రీశైలం చేరుకునేందుకు కాళ్లకు కట్టెలతో 500 కి.మీ. పాదయాత్ర చేస్తున్నారు. వీరిద్దరూ ఆదివారం మంత్రాలయంలో రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. మల్లన్నకు 151 కిలోల పంచలోహ గంటను విరాళంగా ఇస్తానని బసవప్రియ తెలిపారు.