News

గోవుల అక్రమ రవాణా అడ్డగింత

126views

పల్నాడు జిల్లా యడ్లపాడు జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న గోవులను బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా వాహనాల్లో తరలిస్తున్న ఆవులను గుర్తించి పోలీసులకు అప్పగించారు. తుని నుంచి ఎ. ప్రతాపరెడ్డి, హెచ్‌ నాగేంద్ర అనే వ్యక్తులు మినీ లారీల్లో ఆవులను లోడ్‌ చేసుకుని వెళ్తున్నారనే సమాచారం అందుకున్న బీజేపీ నాయకులు, స్థానిక ఎరక్రొండ వద్ద జాతీయ రహదారిపై ఆ వాహనాలను నిలిపివేసి తనిఖీ చేశారు. గోవుల తరలింపుపై వాహన చోదకులను ఆరా తీయగా, వారు ఎటువంటి అధికారిక అనుమతి పత్రాలను చూపలేకపోయారు. వాహనాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌న్‌కు తరలించారు. ఈ మేరకు అక్రమ రవాణాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, వాహన యజమానులు మరియు డ్రైవర్లపై విచారణ చేపట్టారు.