
1.1kviews
లింగాయత మఠానికి ముస్లిం వ్యక్తి ప్రధాన అర్చకుడిగా, అధిపతిగా నియమితులయ్యారు. భవిష్యత్తులో ఆయనే పూర్తిస్థాయి మఠాధిపతి కానున్నారు. కర్ణాటక రాష్ట్రం గదగ్ జిల్లా అసుటి గ్రామంలోని మురుఘరాజేంద్ర కోరనేశ్వర శాంతిధామ మఠం ప్రధాన అర్చకుడిగా 33 ఏళ్ల దివాన్ షరీఫ్ రహీం సాహెబ్ ముల్లా నియమితులయ్యారు. ఈ నెల 26న ఆయన బాధ్యతల్ని స్వీకరించనున్నారు. 350 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కలబురగి జిల్లా కజురి మఠానికి అనుబంధంగా అసుటి మఠం పనిచేస్తోంది. కజురి మఠాధిపతి మురుఘరాజేంద్ర కోరనేశ్వర శివయోగి ఇటీవల ఆయనకు దీక్షనిచ్చారు. దివాన్ షరీఫ్ రహీం సాహెబ్ ముల్లా చిన్ననాటి నుంచి బసవ తత్వాల పట్ల ఆకర్షితులయ్యారు. సామాజిక న్యాయం కోసం శ్రమిస్తున్నారు. అసుటి మఠానికి గతంలో షరీఫ్ తండ్రి రహీంసాహెబ్ రెండెకరాల భూమిని విరాళంగా ఇవ్వడం గమనార్హం.





