
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన లోని (Loni) ప్రాంతంలో మాజీ ముస్లిం యాక్టివిస్ట్ సలీం వాస్టిక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు.హెల్మెట్లు ధరించి మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అశోక్ విహార్ కాలనీలోని ఆయన నివాసంలోకి చొరబడి, సలీం మెడ మరియు పొట్ట భాగంలో పలుమార్లు పొడిచి పారిపోయారు.
దాడిలో తీవ్రంగా గాయపడిన సలీంను మొదట స్థానిక ఆసుపత్రికి, ఆపై పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ICUలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన తర్వాత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. భార్య అఫ్సానా, కుమారుడు ఉస్మాన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సలీం వాస్టిక్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మతపరమైన అంశాలపై తన గళాన్ని వినిపిస్తుంటారు. ఇస్లామిక్ దురాచారాలపై ఎక్కువగా వీడియోలు తీస్తాడు. ఆయన “ఎక్స్-ముస్లిం” (Ex-Muslim) గా గుర్తింపు పొందారు మరియు టెలివిజన్ చర్చల్లో కూడా పాల్గొంటుంటారు.
సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్న పోలీసులు
లోనీ పోలిస్ స్టేషన్ ACP సిద్ధార్థ్ గౌతమ్ నేతృత్వంలోని బృందం ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాయి. దాడి చేసిన వారిని గుర్తించడానికి సంఘటన స్థలం మరియు సమీపంలోని CCTV కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని మరియు మొత్తం కేసును త్వరలో ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు.





