
149views
మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల వివాదం కొత్త మలుపు తిరిగింది. భోజ్‌శాలలో కమల్ మౌలా మసీదు ఉన్న ప్రాంతంలో ప్రాచీన ఆలయాల ఆనవాళ్లను గుర్తించినట్టు భారతీయ పురావస్తు శాఖ(ఏఎస్ఐ) తెలిపింది. వివాదాస్పద భోజ్‌శాల కాంప్లెక్స్‌ను హిందువులు వాగ్దేవి(సరస్వతి) ఆలయంగా, ముస్లింలు కమల్ మౌలా మసీదుగా భావిస్తున్నారు. అయితే, ప్రాచీన ఆలయాల శిథిలాలతోనే మసీదు నిర్మాణం జరిగిందనేందుకు ఆధారాలు లభించాయని పురావస్తు శాఖ తాజాగా తెలిపింది. ముస్లిం వర్గాలు వాదిస్తున్నట్టు మసీదు 11వ శతాబ్దం నాటికి లేదని, ఆ తర్వాత నిర్మాణమైందని పేర్కొంది. ఈ మేరకు ‘ఏఎ్‌సఐ’ అధికారులు సమర్పించిన నివేదికను మధ్యప్రదేశ్ హైకోర్టు సోమవారం పరిశీలించింది. ఇరుపక్షాలూ రెండు వారాల్లో ఈ నివేదికపై అభ్యంతరాలు తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.





