
దేశంలో సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మాలు అంతరించే ముప్పు ఉందని.., పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలే గాడిలో పెట్టాలని కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో గురువైభవోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన యోగీంద్ర కళా మంటపంలో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత కాలంలో చాలామంది కుటుంబ బాంధవ్యాలకు దూరంగా ఉంటున్నారని గుర్తుచేశారు. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, కొడుకులు, కూతుళ్ల మధ్య అవగాహన లోపం, గౌరవం, భయం, భక్తి లేపోవడంతో మనభారత సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు కుమారస్వామి రాఘవేంద్ర స్వామిని దర్శించి, మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మెమెంటో, శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు.





