News

హిందూ ధర్మంపై దాడి జరిగితే హిందువులంతా గొంతెత్తాలి : పవన్‌

134views

మన హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలని రాష్ట్ర  డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్  అన్నారు. ప్రతి భక్తుడికీ ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉందని ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

‘‘దేవుళ్లను ఎవరైనా అవమానిస్తే హిందువులు వ్యక్తిగతంగానే బాధపడతారు. ఎవరు చేసిన కర్మ వారే అనుభవిస్తారని భావిస్తారు. హిందువుల్లో ఈ ఉదాసీన వైఖరి మారాలి. కుల, ప్రాంత, భాష విభేదాలున్నా హిందూ ధర్మం ఒక్కటే. హిందూ ధర్మంపై దాడి జరిగితే హిందువులంతా గొంతెత్తాలి. మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ఎవరికీ వ్యతిరేకం కాదు’’ అని పవన్‌ సంచలన ట్వీట్‌ చేశారు.