
మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు సెలవులు ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్(VHP) తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మహా జాతర జరిగే 3 రోజులు లేదా కనీసం జనవరి 30, 31న అయినా అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించాలని VHP రాష్ట్ర ధర్మాచార సంపర్క్ ప్రముఖ్ బాలస్వామి కోరారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతరకు వెళ్లి రావడానికి, రద్దీ తగ్గించడానికి సెలవులు అవసరమని తెలిపింది. మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సెలవులపై ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. నిజానికి ఉత్సవానికి ఎలాంటి విలువా ఇవ్వడం లేదని అన్నారు. సెలవులతో పాటు జాతరలో భక్తుల సౌకర్యం, భద్రత, రవాణా ఏర్పాట్లు మెరుగుపరచాలని కూడా VHP విజ్ఞప్తి చేసింది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం పూర్తి స్థాయి సెలవులు ప్రకటించలేదు. ఈ డిమాండ్ కు చాలా మంది భక్తులు మద్దతు తెలుపుతూ.. సెలవులు ఇవ్వాలని సర్కారును కోరుతున్నారు.





