
2026 T20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు బయటికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇండియాలో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడటానికి భద్రతా కారణాలను సాకుగా చూపిన బంగ్లాదేశ్.. ఏకంగా టోర్నీ నుంచే దూరం అయిన సంగతి తెలిసిందే. ఇదే కారణాలను చూపి ఇప్పుడు ICC బంగ్లా స్పోర్ట్స్ జర్నలిస్టులను కూడా టోర్నీ నుంచి నిషేధించిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. టోర్నమెంట్‌ను కవర్ చేయడానికి బంగ్లాదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్టులకు గుర్తింపు ఇవ్వడానికి ICC నిరాకరించింది. ఇది కేవలం భారతదేశంలో జరిగే మ్యాచ్‌లకే పరిమితం కాదు, శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లను కూడా కవర్ చేయకుండా బంగ్లాదేశ్ జర్నలిస్టులను ICC బ్యాన్ చేసింది.
ఈ విషయంపై ఇప్పటి వరకు ఐసీసీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. భారతదేశం-శ్రీలంక మ్యాచ్ కవరేజ్ కోసం బంగ్లాదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఇవ్వడానికి ఐసిసి నిరాకరించిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. గతంలో బంగ్లాదేశ్ జట్టు భారతదేశంలో మ్యాచ్‌లు ఆడకూడదని పట్టుబట్టడంతో ICC ఆ జట్టును టోర్నమెంట్ నుంచి బహిష్కరించింది. ఈ మెగా టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.





