
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని మల్లాపురం సమీప కొండల్లో శ్రీ విప్రమలై లక్ష్మీనరసింహ స్వామి కొలువుదీరారు. ఈ ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఈ నెల 30 నుంచి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరగనున్నాయి. ఈ విషయమై ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ జనవరి 30న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 31న శ్రీవారి కల్యాణం మాలదీక్షాధారణ, ఉచిత వివాహాలు జరిపిస్తామన్నారు. ఫిబ్రవరి 1న ఆదివారం ఉదయం 10 గంటలకు స్వామివారి బ్రహ్మ రథోత్సవం పుర వీధుల్లో వీనుల విందుగా సాగుతుందన్నారు. భక్త జనులు అధిక సంఖ్యలో ఉత్సవాలకు హాజరైన స్వామివారి కృపాకటాక్షలకు పాత్రులు కావాలని కోరారు. ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. భక్తులు ఉత్సవాలను జయప్రదం చేయడంతో పాటు దేవాలయ సంప్రదాయ రక్షణకు సహకరించాలని కమిటీ సభ్యులు శ్రీరామ్మూర్తి, బి.ఎన్.టి.తిప్పేస్వామి కోరారు.





