
గణతంత్ర దినోత్సవాల సమయంలో జిన్నాకి అనుకూలంగా నినాదాలు చేసినందుకు బీహార్ లో మన్సూర్ ఆలం అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు గుమిగూడిన సమయంలో మహ్మద్ మన్సూర్ ఆలం అనే ఉపాధ్యాయుడు జిన్నాను ప్రశంసిస్తూ నినాదాలు చేశాడు.
ప్రత్యక్ష సాక్ష్యులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ‘‘జిన్నా అమర్ రహే’’ వంటి నినాదాలు చేశాడని, దీంతో చాలా మంది అసౌకర్యానికి కూడా గురయ్యారని పేర్కొంటున్నారు. ఈ వార్త వ్యాపించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు పాఠశాల వద్దకు చేరుకొని, నిరసన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ ఉపాధ్యాయునిపై చర్యలకు డిమాండ్ చేశారు.
ఈ ఘటన సీరియస్ కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధనంజయ్ తివారీ వెంటనే కిషన్ పూర్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ చర్య పాఠశాల గౌరవాన్ని దెబ్బతీసేలా వుందని, రాజ్యాంగానికి విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 152, 252, 196, మరియు 197 కింద మన్సూర్ ఆలంపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.
మరో వైపు విద్యాశాఖ కూడా అలర్ట్ అయ్యింది. అంతర్గతంగా శాఖా దర్యాప్తుకు కూడా ఆదేశించింది. ఈ ఘటన అతి తక్కువ సమయంలోనే వ్యాపించింది. స్థానికులు, తల్లిదండ్రులు కూడా అలర్ట్ అయిపోయి, వెంటనే ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





