ArticlesNews

డోన్యి-పోలో-తులోమ్‌ ‌రుక్బో- వనవాసి కల్యాణ్‌ ఆ‌శ్రమం

94views

వనవాసులలో జాతీయ చైతన్యం తీసుకు రావడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చేస్తున్న కృషి బయటి ప్రపంచానికి అంతగా తెలియదు. చత్తీస్‌గడ్‌ ‌జష్‌పూర్‌ ‌నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ ‌పని ఆరంభించింది. ఈ ఉద్యమం స్వర్ణోత్స వాలను కొద్దికాలం క్రితం నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రాల వారు సహా, 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాతాల నుండి దాదాపు 250 తెగలు, 200 గిరిజన జిల్లాల నుండి 3000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ‘సంస్కృతిని కోల్పోవడమంటే ఉనికి కోల్పోవడమే’ అనే నినాదంతో ఉద్యమం సాగుతు న్నది. తమ వారసత్వాన్ని చూసి వారు గర్వించేందుకు వీలుగా విదేశీయ పాలనకు వ్యతిరేకంగా కొండకోనలలో పోరాడి చెరగని ముద్రవేసిన చారిత్రక వ్యక్తుల జాబితాను విడుదల చేశారు. బీర్సాముండా, సిద్దోకన్హు, రాణీ దుర్గావతి, పుంజాభాల్‌, అల్లూరి సీతా రామరాజు, రొప్పలియాని, బెగ్రాభిల్‌, ‌వీర్‌ ‌తాంతియా, తులోమ్‌ ‌రుక్బో, కార్తీక్‌ ‌వరాన్‌, ‌రాణి గైడిన్యులు ఆ జాబితాలో ఉన్నారు. నేటి తరం వనవాసీలు నక్సలైట్లతోనూ, వేర్పాటు వాదులతోను తలపడి జాతీయతా భావాన్ని చాటుకున్నారు.

మనిషి అమితమైన మేధాశక్తిని, ఆలోచనతో కూడిన అనురక్తిని, పురోగ•తి సాధించేందుకు కావలసిన అభివ్యక్తిని సమృద్ధిగా కలిగినవాడు. ఆ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ ఒకరి మేలు కోసమో, జాతి పురోగతి కోసమో నిస్వార్ధంగా కృషి చేసేవారి జీవితాలే సార్థకమవుతాయి. అలాంటివారికి ఏనాటికీ మరణం లేదని, భువిలో అమరులని అంటాడు భర్తృహరి. ఈ కోవలోనివాడే తులోమ్‌ ‌రుక్బో. అరుణాచల్‌‌ప్రదేశ్‌ ‌వేగుచుక్క ఆయనే. ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌సందర్భంగా చరిత్రపుటలకు ఎక్కని గొప్ప దేశభక్తుల వీరగాథలను, సాంస్కృతిక వైభవాన్ని, సాధించిన విజయాలను నెమరు వేసు కున్నాం. ఆ విధంగా గిరిజన స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలకు, గతంలో ప్రాచుర్యంలో లేని గిరిజన చరిత్రకు ప్రాధాన్యం తెచ్చింది. ఫిబ్రవరి 20, 1987న అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌రాష్ట్రంగా అవతరించింది.

అరుణాచలప్రదేశ్‌లో మొదలైన పునరుజ్జీవన మత ఉద్యమం ‘డోన్యి-పోలో’. దీనికి పితామహుడే తులోమ్‌ ‌రుక్బో. ఇది తాని (ఆది) అనిమిస్ట్ ఆధ్యాత్మి కతను పునర్‌ ‌నిర్మించడానికి ప్రయత్నిస్తున్నది. ఈశాన్య భారతదేశంలో క్రైస్తవ మిషనరీల మోసపూరిత మత మార్పిడులను రుక్బో విమర్శించాడు. ఆదివాసి జీవన విధానానికి ఆయన చేసిన కృషి కారణంగా రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘం నిర్వహిస్తున్న వనవాసి కల్యాణ్‌ ఆ‌శ్రమ ప్రాజెక్టుకు రుక్బో ప్రేరణగా నిలిచారు. ఆదివాసి ప్రజలను మతాంతరీకరణ చేసిన తరువాత అనిమిస్ట్ ఆచారాలను, వారి పండుగలను, వారి దేవుళ్లను సైతాన్‌ (‌దుష్టశక్తులు) అని విమర్శించాలని మిషనరీలు ఆదేశిస్తూ ఉంటాయి.

అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ అం‌టే ఉదయించే సూర్యుని భూమి అని అర్ధం. పురాణాల ప్రకారం ఈ ప్రాంతం ప్రాచీన విదర్భలో భాగం. మహాభారతం, రామా యణం వంటి ప్రాచీన గ్రంథాలలో ఈ ప్రాంత ప్రస్థా వన ఉంది. లోహిత్‌ ‌జిల్లాలోని పరశురామకుండంలో పరశురాముడు తన పాపాలను కడిగివేసుకున్నాడని, ఇక్కడే వ్యాస మహర్షి తపస్సు చేశాడని, శ్రీకృష్ణుడు రుక్మిణిని ఇక్కడ నుండే వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. ఇక్కడ సుమారు 25 తెగలున్నాయి. అవి- ఆది, ఆక, అపతని, మిషిమి, నిషిమనస్‌, ‌పన్‌గ్గీ, కర్‌కో మొదలైనవి. దీనిలో ఆది అంటే హిల్‌మాన్‌ అని అర్ధం. వీరికి వ్యవసాయం ప్రధాన వృత్తి. వీరి ప్రధాన పండగలు-సోలుంగ్‌, ‌మోపిన్‌, ఎటోర్‌, ‌యూనియింగ్‌, ‌డోన్‌జన్‌. ‌నిజానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈశాన్య భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితమే వేర్పాటువాదంతో కూడిన మిషనరీ కార్యకలాపాలు. వీటిని ప్రతిఘటించిన సంస్థ వనవాసీ కల్యాణ ఆశ్రమం. మిషనరీల మత మార్పిడి కార్యకలాపాలకు ప్రత్నామ్నాయంగా, గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షిస్తూ వారి సంక్షేమం కోసం వనవాసి కళ్యాణ్‌ ఆ‌శ్రమం (వీకేఏ) రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ అనుబంధ సంస్థగా డిసెంబరు 26,1952న ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌ (‌నేటి చత్తీస్‌ఘడ్‌)‌లోని జష్‌పూర్‌ అనే గిరిజన ప్రాంతంలో రమాకాంత్‌ ‌కేశవ్‌ ‌దేశ్‌పాండే ఆ సంస్థను ప్రారంభించారు. జష్‌పూర్‌లోని రాజా విజయభూషణ్‌ ‌జుడావో సహకారంతో శిధిలావస్థలో ఉన్న రాజ్‌ ‌భవన్‌లో కొద్దిమంది గిరిజన బాలురతో ఒక హాస్టల్‌ను ప్రారంభించారు.

ఈ సంస్థ కార్యకలాపాలు విజయవంతం కావడంతో 1977లో ఇది అఖిల భారత సంస్థగా గుర్తింపు పొందింది. అప్పటి నుండి అఖిల భారతీయ వనవాసి కల్యాణ్‌ ఆ‌శ్రమమైంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయాభివృద్ధి, గ్రామీణక్రీడలు, మహిళా సాధికారత, సాంస్క ృతిక పరిరక్షణ, స్వయం ఉపాధి వంటి వివిధ రంగాలలో సేవాకార్యక్రమాలన• నిర్వహి స్తున్నది. వనవాసి సమాజాన్ని జాతీయ స్రవంతిలో భాగం చేయడం, తద్వారా వారు విద్యావంతులుగా స్వావలంబన కలిగిన వారుగా ఎదగడానికి సహాయం చేయడం ఆశ్రమం ప్రధాన లక్ష్యం. లక్ష్యసాధన కోసం నిశ్శబ్దంగా పనిచేయడానికి అది ఇష్టపడుతుంది.

ఆదివాసీల పట్ల ఆదరణ, వారిని జాతీయ స్రవంతిలో అంతర్భాగంగా ఉంచే కృషి వెనుక గొప్ప నిర్మాణాత్మక దృష్టి ఉంది. అరుణాచల్‌ ‌క్రీ।।శ।। 5 లేక 6 శతాబ్ది కాలంలో మోన్పా రాజ్య నియంత్రణలో ఉండేది. 1826 యాండబు ఒప్పందం ప్రకారం బ్రిటిష్‌ ‌నియంత్రణలోకి వచ్చింది. 1838 నాటికి బ్రిటిష్‌ ‌పాలనలోనికి వచ్చింది. అప్పుడు దీన్ని నార్త్ ఈస్ట్ ‌ప్రాంటియర్‌ ఏజెన్సీ (చీజుఖీ) అని పిలిచేవారు. 1914లో సిమ్లా ఒప్పందం ద్వారా టిబెట్‌, ‌చైనా, బ్రిటిష్‌ ఇం‌డియా మద్య మెక్‌మోహన్‌ ‌రేఖ సరిహద్దుగా నిర్ణయించారు. భారత్‌-‌చైనాకు మధ్య 550 మైళ్ల (890 కిలోమీటర్లు) పొడవైన సరిహద్దు రేఖ ఉంది. బ్రిటిష్‌ ఇం‌డియా కాలంలో భారత్‌ ‌చైనాల మధ్య నేరుగా సరిహద్దు లేదు. మధ్యలో టిబెట్‌ ఉం‌డేది. చైనా పీపుల్స్ ‌లిబరేషన్‌ ఆర్మీ 1951 అక్టోబరులో టిబెట్‌ను ఆక్రమించ•ంతో చైనాయే భారత్‌ ‌సరిహద్దు దేశమయింది. అలాగే మెక్‌మోహన్‌ ‌రేఖను అంగీక రించక అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌తమదేనని వాదిస్తూ, చైనా అప్పుడప్పుడూ ఆ లైన్‌ను అతిక్రమిస్తూ ఉంటుంది. అందువల్ల అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ఎప్పు‌డూ వార్తల్లో ఉంటుంది.

భౌగోళికంగా ఈశాన్య భారతదేశాన్ని ప్రధాన భారత భూభాగంతో కలిపి ఉంచేదే సిలిగురి కారిడార్‌. ‌పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి నుండి 20 లేక 22 కిలోమీటర్ల వెడల్పు, 200 కిలోమీటర్ల పొడవున ఇది ఉంటుంది. కోడిమెడ ఆకారంలో ఉంటుంది కాబట్టి చికెన్‌నెక్‌ ‌కారిడార్‌ అం‌టారు. ఈశాన్య భారతంలో అస్సాం, అరుణాచలప్రదేశ్‌, ‌నాగాలాండ్‌, ‌మణిపూర్‌, ‌మిజోరాం, త్రిపుర, మేఘాలయలను 7 సిస్టర్స్ (ఏడుగురు అక్కాచెల్లెళ్లు) అని పిలుస్తారు. చికెన్‌నెక్‌ ‌పశ్చిమాన నేపాల్‌ ఉత్తరాన భూటాన్‌, ‌తూర్పు బంగ్లాదేశ్‌ ‌దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది. చికెన్‌నెక్‌ ‌లేకుంటే ఈశాన్య రాష్ట్రాలక• భారత్‌తో భౌతికంగా సంబంధాలు తెగి పోతాయి. అందుకే చికెన్‌నెక్‌ ‌భారత్‌కు వ్యూహాత్మకంగా రాజకీయంగా కీలకం. కాన్‌స్టాంట్‌నోపుల్‌ (‌నేటి ఇసాంబుల్‌) ‌టర్కీకి ఎలా కీలకమో అలాగే చికెన్‌నెక్‌ ‌కారిడార్‌ ‌భారత్‌కు అంతే కీలకం. ఈ కారిడార్‌ను కోల్పోతే ఈశాన్య రాష్ట్రాల రక్షణ భారత్‌కు కష్టమే.ఈ చికెన్‌నెక్‌ ‌కారిడార్‌ ‌రవాణా వాణిజ్యం, సైనికుల తరలింపులకు ప్రధాన మార్గం. ఒక్క మాటలో-ఈ కారిడార్‌ ‌భారత్‌ అభివృద్ధికి జీవనాడి. చికెన్‌నెక్‌ ‌భారత్‌ ‌చైనా సరిహద్దుకు సమీపంలో ఉంది. మరీ ముఖ్యంగా అరుణాచల ప్రదేశ్‌లోని తవాంగ్‌ ‌ప్రాంతానికి దగ్గర (6వ దలైలామా ఇక్కడే జన్మించారు). 1962లో భారత్‌-‌చైనా యుద్ధంలో డ్రాగన్‌ ‌సైన్యం ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు దీని ప్రాముఖ్యత తెలిసింది. ఇక్కడ నుండి అక్రమ వలసలు, ఆయుధాల స్మగ్లింగ్‌, ‌తీవ్రవాద కార్యకలాపాలు జరిగే అవకాశాలు అధికం. వీటిని గట్టిగా నియంత్రిచడం ద్వారా భారత్‌ ‌సార్వ భౌమాధికారాన్ని, జాతీయభద్రతను కాపాడుకో గలుగుతుంది.

ఈ కారిడార్‌ ‌ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు వస్తువులు ముఖ్యంగా తేయాకు, చమురు, కలప మొదలైన సరుకులు రవాణా చేస్తున్నారు. ఒకవేళ ఈ చికెన్‌నెక్‌ ‌కారిడార్‌ ‌లేకపోతే భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుంది. ఈ కారిడార్‌ ఇరుకైనది కావడం వల్ల పొరుగున వున్న శత్రుదేశాలు సులభంగా లక్ష్యం చేసుకునే అవకాశం వుంది. అందుకే ఇక్కడ భారత్‌ ‌బలమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. మొత్తంగా ఈ చికెన్‌నెక్‌ ‌భారత్‌ ఐక్యతకు, భద్రతకు, ఆర్థిక అభివృద్ధితోపాటు ఈ ఈశాన్య సరిహద్దు ప్రాంత సమగ్రతను కాపాడుతుంది. ఇలాంటి కీలక ప్రాంతంలో జాతీయ భావాలతో వేర్పాటువాదాన్ని అరికట్టినవారే రుక్బో.

డోన్యి-పోలో అంటే అర్ధం ‘సూర్యుడు చంద్రుడు’ (డ్యోని అంటే సూర్యుడు, పోలో అంటే చంద్రుడు). ఇది క్రైస్తవ మత విస్తరణన• ప్రతిఘటిస్తూ 1970లో సంస్థాగత రూపం పొందిన ప్రకృతి ఆధారిత విశ్వాసం. వీరు సూర్యచంద్రులను దైవాలుగా పూజిస్తారు. రాష్ట్ర జనాభాలో అధికులు ఈ మతాన్ని అనుసరిస్తారు. అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌గిరిజన తెగల సాంప్రదాయ విశ్వాసాల నుండి ఉద్భవించిన డోన్యి పోలో క్రైస్తవ మతవ్యాప్తిని అరికట్టడంలో సఫలీకృత మైంది. అక్కడి ఇళ్లలో ఎర్రసూర్యుని చిహ్నంతో తెల్లటి జెండా చూడవచ్చును. వీరు చర్చి తరహాలోనే ఆదివారం ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తారు. వీరు తమని తాము సూర్యచంద్రుల సంతానంగా అభివర్ణిస్తారు.

భగవంతుడు సర్వాంతర్యామి, కాబట్టి వారిని దేవాలయంలో బంధించరాదని వీరి నమ్మకం. ప్రజలను మంచి మార్గంలో నడపడానికి ‘న్యుబు’ లేక ‘శామన్లు’ ఆధ్యాత్మిక మార్గ దార్శనికులు ఉంటారు. వీరు పూజలు, వైద్యం చేస్తారు. వీరి మతం విడాకులక• అంగీకరించదు. నైతిక ప్రవర్తనలో తేడా వస్తే మొత్తం కుటుంబాన్నే డోన్యో నాశనం చేస్తాడని నమ్మకం. కాబట్టి నీతిమంతులుగా జీవనం గడుపుతారు.

వీరు సోలుంగ్‌, ‌న్యోకుమ్‌డీ వంటి పండుగలు నిర్వహిస్తారు. అవి పంటలు బాగా పండాలనీ, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షిస్తాయి. వరి ప్రధానమైన పంట. దానికి కృత్రిమ ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడరు. కారణం వీరు వరిపొలాన్నే చేపల చెరువుగా తయారు చేసుకుం టారు. కాబట్టి ప్రకృతికి హాని తలపెట్టేవాటిని వీరు వాడరు. కావలసిన కూరగాయలను వారే పండించు కుంటారు. పర్యావరణ పరిరక్షణ కూడా వీరికి ఒక ఆదర్శం.

తులోమ్‌ ‌రుక్బో డిసెంబర్‌ 1,1938‌న (అరుణా చల్‌ ‌ప్రదేశ్‌) ‌పసిఘాట్‌ ‌జిల్లాలో జన్మించారు. మిషనరీల మతమార్పిడులకు నిరసనగా తులోమ్‌ ‌రుక్బో 1976లో తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామాచేసి తన పూర్తి కాలాన్ని సామాజిక సేవకు అంకితం చేశాడు. 1986లో డోన్యో పోలో అను చరులు సంస్కృతిని, సాహిత్యాన్ని, మత సిద్దాంతాలను వ్యాప్తి చేయడానికి మూడు సంస్థలను ప్రారంభిం చారు. 1. తనీ జాగృతి ఫౌండేషన్‌ (2) ‌డోనీ పోలో యూత్‌ ‌ఫెడరేషన్‌ (3) ‌డోన్యో పోలో యీలమ్‌ ‌కెబాంగ్‌ (‌డి.పి.వై.కె). వీరు రుక్బో (డోనీపోలోయిజమ్‌ ‌పిత) సిద్ధాంతాలను ప్రచారం చేయడం, సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం, దేవాలయాలను నిర్మించి ఆదివారం ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్‌ 31 ‌తేదీని డోన్యోపోలో దినంగా నిర్వహిస్తున్నారు.

మూలం:

1) స్వరాజ్య మేగజైన్‌లో “How Arunachala Pradesh is Dharmic Heritage negates” by Jaideep Majundar.

2)   Indian Journal of Anthropological Research in Dongi Pole as an Indegenerous religion in Arunachala Pradesh by Kamal K. Mishra.

3)   Adivasi or Vanavasi Tribal India and the politics of Hinductvas by Kamal Narayan Choubey.

4)   Talom Rukbo and the Donyipolo Yelam Kebang Restruring by Scheid claire International Asian Forum.

5)   Economic Times Sept 4, 2004.

6)   Religious nationalism, Christianisation and Institutionalism of indegeneous faiths in contemporary Arunachala Pradesh, India by Basawathi Boryhain & Mekroy Dodum.

7) Donyi Poloism : Aneco spiritual way of life by Age Kurian – IJCRt international journal of creative research thoughts – 7 2022. Vol-10.