News

జాతీయ విద్యా విధానాన్ని దీర్ఘకాలిక దృష్టితో చూడాలి : కృష్ణ గోపాల్

175views
జాతీయ విద్యా విధానాన్ని (NEP) దీర్ఘ కాలిక దృక్పథంలో చూడాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ కృష్ణ గోపాల్ సూచించారు. రాబోయే 25 సంవత్సరాలలో విద్యాభారతి పాఠశాలల్లో ప్రవేశపెట్టబోయే మార్పులను దూరదృష్టితో ప్రణాళిక వేశామని, తదనుగుణంగానే అమలు చేయాలని సూచించారు. తిరువనంతపురంలోని భారతీయ విద్యాపీఠ్ పాఠశాలలో విద్యాభారతి అఖిల భారతీయ కార్యకర్త శిబిరంలో కృష్ణ గోపాల్ మాట్లాడారు.
దేశ వ్యాప్తంగా విద్యా భారతి పాఠశాలలు పనిచేస్తున్నాయని, ఈ పాఠశాలల ద్వారా దేశానికి అవసరమైన వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. యువత తమ సొంత దృక్పథాలను ఏర్పరచుకునేలా మార్గనిర్దేశనం చేయాలన్నారు.
కొత్త తరానికి విభజన స్వరాలు కాకుండా, ఐక్యతా దృక్పథంతో జీవించడం నేర్పించాలని సూచించారు. విద్యా రంగంలో ఎలాంటి మార్పులు అవసరం, వాటిని దశలవారీగా ఎలా అమలు చేయవచ్చో విద్యాభారతిలో పనిచేసే ప్రచారకులు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా చేపట్టాలని సూచించారు.
ప్రచారక్ అంటే కేవలం ఓ వ్యక్తి కదని, ఒక ఆలోచన అని అన్నారు. ప్రచారకులు సంఘ లక్ష్యాలు, భావజాలం, పద్ధతులను కలిగి వుంటారని, వారి లక్ష్యం ధర్మ రక్షణ అని, దీని ద్వారా దేశాన్ని పరమ వైభవం వైపు నడిపించడం అని వివరించారు. అయితే ధర్మ రక్షణ, పరమ వైభవం అనేది వేర్వేరు కాదని స్పష్టం చేశారు.
దేశం, ధర్మంతో పాటు సమాజ రక్షణ, దీని ద్వారా దేశాన్ని పరమ వైభవం సాధించడమే ఆరెస్సెస్ లక్ష్యం అని కృష్ణ గోపాల్ స్పష్టం చేశారు.