
నంద్యాల జిల్లా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100 సంవత్సరాల ఉత్సవాలలో భాగంగా హిందువులందరూ ఏకమయ్యే దిశగా ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనం విజయవంతం అయ్యిందని పెద్దలు అభిప్రాయ పడ్డారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షులు శ్రీ సిలివేరు వేణుగోపాల్. మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ హిందూ సంఘటన కొరకు కృషి చేస్తున్నదని తెలిపారు.
ముఖ్యఅతిథిగా విచ్చేసి నటువంటి పూజ్య స్వామీజీ శ్రీ శ్రీ శివ యోగానంద సరస్వతి స్వామి వారు మాట్లాడుతూ హిందువులందరూ సంఘటితంగా ఉండాలని రాబోవు తరాలకు మన సాంప్రదాయాలు అందించాలని తెలిపారు.

అతిధిగా విచ్చేసిన కౌన్సిలర్ శ్రీ కండే శ్యామ్ సుందర్లాల్ మాట్లాడుతూ హిందుత్వం బలపడిందని హిందువుగా జన్మించడం మన పూర్వజన్మ సుకృతమని రాబోవు తరాలు హిందువులే భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పడం జరిగింది. ముఖ్య వక్తగా విచ్చేసిన డాక్టర్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ హిందుత్వం వినా భారతదేశాన్ని ఊహించలేమని ప్రపంచంలో కెల్లా ఇతర సామ్రాజ్యాలపై దండెత్తని జాతి హిందూ జాతి అని గర్వంగా చెప్పగలమని మన దేవీ దేవతలకు కూడా ఆయుధాలు కలిగి ఉంటారని, అవసరమైనప్పుడు అస్త్రాలను ఉపయోగించాలని సభా ముఖంగా తెలపడం జరిగినది.
ఈ కార్యక్రమంలో సుమారు మహిళలు పురుషులు 1700 మంది హిందూ బంధువులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీ కాంప్లెక్స్ వాసులు శ్రీ దుదెల సురేష్ బాబు , శ్రీ కసెట్టి చంద్ర, శ్రీ సిరిగిరి బాలాజీ, శ్రీ కటకం శ్యాంప్రసాద్, శ్రీ ఎంవి చంద్రమౌళి, శ్రీ చింతలపల్లి వాసు, శ్రీ కె.వి రవికుమార్, శ్రీమతి పండ్లాపురం వసుమతి , డాక్టర్ మాధవి ,డాక్టర్ భార్గవ్ వర్ధన్ రెడ్డి , శ్రీ సాత్విక్ రెడ్డి, శ్రీ రాయసం బాబురావు తదితరులు పాల్గొన్నారు





